శార్వరినామ ఉగాది శుభాకాంక్షలు!

కరోనాకి గల ప్రాధమిక కారణాన్నీ, మానవజాతి ప్రాధమిక కర్తవ్యాన్నీ గుర్తుచేస్తూ శార్వరినామ ఉగాది శుభాకాంక్షలు.

దీపావళి

కాకరొత్తులు మెరుస్తూచిచ్చుబుడ్లు వెలుగుతూటపాసులు పేలుతూభూవిష్ణు చక్రాలు తిరుగుతూఇంటిముందు దీపాలు వీధిలోని చీకటిని తరుముతుంటేఊరంతా దీపావళి! నరుడిలోనే నరకుడుమానవుడిలోనే మాధవుడుమనలోని నరకుణ్ణిమనలేని అసురుణ్ణి చేస్తూమనలోని మాధవుడు నిరంతరం ప్రయత్నిస్తేబ్రతుకంతా దీపావళి! ప్రమాదాలతో కాక, ప్రమోదాలతో మీరీ పండుగ చేసుకోవాలని ఆశిస్తూదీపావళి శుభాకాంక్షలు! If you find reading Telugu difficult, listen to my audio right here.

రక్షాబంధనం

జగమంతటికీ శ్రీరాముడే రక్ష చెల్లికి మాత్రం అన్నయ్యే శ్రీరామరక్ష! అన్నయ్యకి తాను చెల్లి తమ్మునికైతే ఆమే తల్లి!! ఆ అనుబంధాన్ని గుర్తు చేస్తూ, సోదరభావాన్ని పెంచేదే రక్షాబంధనం!!! అన్నాచెల్లెళ్లకి, అక్కాతమ్ముళ్ళకి, ఆడవాళ్ళని అక్కాచెల్లెళ్ళుగా భావించే అన్నాతమ్ముళ్ళకి రక్షాబంధన శుభాకాంక్షలు! If you find reading Telugu difficult, listen to my audio right here.