అప్పుడే సంవత్సరం గడిచిందా! ‘శార్వరి’ వొచ్చింది మొన్నేగా.. అన్నట్టుంది!
ఇంట్లోంచి గట్టిగా కనీసం కాలైనా బయట పెట్టింది లేదు.. భూమి మాత్రం సూర్యుడి చుట్టూ ఒక చుట్టు చుట్టేసింది!
వసంత కోకిలలు తమ కుహూ రాగాలు మళ్ళీ కూస్తూ ఉన్నాయ్!
రంగు రంగుల పూలు మళ్ళీ పూస్తూ ఉన్నాయ్!
కొన్ని చోట్ల మండే ఎండలు మళ్ళీ కాస్తూ ఉన్నాయ్!
మరి కొన్ని చోట్ల కరిగే మంచుల సెలయేళ్ళు పరవళ్ళు తీస్తూ ఉన్నాయ్!
బడి పిల్లలకి సెలవులు మళ్ళీ వస్తూ ఉన్నాయ్!
వీటితో పాటు, అదేమిటో గానీ, కరోనా కూడా తన కోరలు మళ్ళీ చాస్తూ ఉంది!
గత కొంత కాలంగా అశ్రద్ధగా ఉన్న మనల్ని హెచ్చరిస్తూ ఉంది!
మనమంతా తీసుకోవలసిన జాగ్రత్తల్ని మళ్ళీ గుర్తు చేస్తూ ఉంది!
‘ప్లవము’ అంటే ‘పడవ’ అని అర్ధం.
ఈ ఉగాది, మనల్ని ‘కరోనా’ అనే విషసాగరం దాటించి, గట్టున పడేసే ఆశల ప్లవము కావాలని ఆశిస్తూ..
మళ్లీ కోయిల రాగాల్ని వింటూ, పూవుల అందాల్ని చూస్తూ, పరవళ్ళు తొక్కే సెలయేళ్లతో ఆడుతూ, సెలవులని ఆనందంగా గడిపే మునుపటి రోజులు తొందర్లోనే రావాలని కోరుకుంటూ..
అందరికీ శ్రీ ప్లవ నామ సంవత్సర శుభాకాంక్షలు!