మహాత్మా!

On his 150th birth anniversay, here is my tribute to the Great Soul.. a quick peek into his journey from Africa to Paradise!


(thrown off a train in South Africa)
నల్లగున్నావ్ ఇక్కడొద్దని
రైలు నుంచే గెంటి వేస్తే
మొండి ధైర్యం వెంట రాగా
పౌర హక్కుకు పోరు సలిపె!

(returning to India and becoming INC president)
సొంత గడ్డకు తిరిగి వచ్చి
జాతినంతా కూడ గట్టి
తల్లి భారతి స్వేచ్ఛ కోసం
నేత ఒక్కడు కదం తొక్కె!

(introducing non-voilence)
శస్త్రమెరుగని శాస్త్రముందని
ఉత్త చేతుల కొత్త యుద్ధం
మొదలు పెట్టిన సత్యమూర్తికి
వింత లోకం వంత పాడె!

(intensifying ‘swadeshi’)
స్వదేశి మంత్రం జపింప చేసి
విదేశి వస్తువు దహించి వేసి
ఖద్దరు వస్త్రం ధరించి చూపి
చరఖా చక్రం హసించి తిప్పె!

(getting jailed and conflicts in INC)
తెల్ల ఏలికల కర్కశత్వము
జైలు గోడల అంధకారము
సొంత గూటిన భేదభావము
ఆపలేదుగ స్వరాజ్య సంకల్పం!

(persisting non-voilence and ‘satyagraha’)
ఆవేశమే అహింసగ మారగ
ఆగ్రహమే సత్యాగ్రహమవ్వగ
‘ఆయుధం లేని యుద్ధమేంటని’
బెంబేలెత్తెను బ్రిటీషు రాజ్యం!

(‘Dandi’ march)
ఉప్పు మీదే పన్ను వేస్తే
ఉప్పెనల్లే జాతి ఎగసె
‘దండి’దాకా దండు కదలె
దొంగ దొరలింగ్లండు తరలె!

(freedom, separation and assassination)
స్వేచ్ఛ పొందిన జాతి తనువును
నిట్ట నిలువున చీల్చుతుంటే
అడ్డు తగిలిన జాతిపితనే
అంతమొంచెను అసుర సుతుడు!

(inspiring the world leaders)
ఆఫ్రికాలో జాతి పీడన అంతమైతే
అమెరికాలో పౌరహక్కులు అంకురిస్తే
ఎల్ల జాతులు శాంతి పంథా కోరుకుంటే
అవి నీవు వేసిన బాటలే! అది నీవు చూపిన మార్గమే!!

Speak the truth!
Seek the truth!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: