సగం మూసిన కిటికీ తెరల నుంచి బారెడు పొద్దెక్కిన సూరీడు నిద్దర లేపుతుంటే, “బద్ధకం కూడా ఇంత హాయిగా ఉంటుందా?” అరుదుగా తప్ప ఇలాంటి అవకాశం రాని నేను, ‘పక్కపై ఇంకాసేపు దొర్లితే తప్పేంట’నుకుంటున్నపుడు, దిండుపై రాలిన జుట్టు రాబోయే దశాబ్దిని గుర్తు చేయగా, తాపత్రయ పడే అర్ధాంగి తయారుచేసిన ఉల్లిపాయ గుజ్జుతో కాబోయే అరగుండుని కప్పేసి, ‘తలపై ఉండనిది ముఖంమీద మాత్రం ఎందుక’ని, కసితో క్షవరించి, ఆపై తలంటి, ‘నువ్వు.. నువ్వు.. నువ్వే.. నువ్వు..’ లాంటిContinue reading “భలే మంచి రోజు”
Category Archives: Telugu
శ్రీ దుర్ముఖి నామ ఉగాది శుభాకాంక్షలు
తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు – ఉగాది ప్రేమ, సరసం, నమ్మకం, చురక, తగువు, అలక – కాపురం ఆరోహణం, విరోధం, విరామం, ఊడిగం, విరమణం, అవరోహణం – ఉద్యోగం సంతోషం, ఉల్లాసం, సుఖం, కోపం, దుఖం, కష్టం – జీవితం అన్నీ సమపాళ్ళల్లో తీసుకున్నప్పుడు, ప్రతిదీ పండుగే, ప్రతిరోజూ ఉగాదే!
అభిరామ దశకం
పదో ఏడు. పిల్లాడు పెద్దాడయ్యే ఈడు. బాల్యానికి దూరమౌతూ కౌమారానికి చేరువౌతుంటే.. అమాయకత్వమే తప్ప మరేదీ తెలీక, పరిచయంలేని మరో ప్రపంచం వైపు పరుగుపెడుతుంటే.. ఓ తండ్రి ఇచ్చే సూచన, దీవెన, బహుమానం.. అభిరామ దశకం. పెద్దలని గౌరవించు.. పద్ధతులని పాటించు! అల్పులని ఆదరించు.. తప్పులని మన్నించు! ఉన్నదాన్ని అనుభవించు.. లేనిదాన్ని విస్మరించు! ప్రతిభని గుర్తించు.. ఈర్ష్యని త్యజించు! పరిసరాలని గమనించు.. కీడెంచి మేలెంచు! మనసుని మందలించు.. బుధ్ధిని బుజ్జగించు! నిరంతరం శ్రమించు.. లక్ష్యాన్ని సాధించు! కష్టాన్నిContinue reading “అభిరామ దశకం”
సముద్రమెంత?
మొదటి సారి మహా సముద్రయానం చేసిన నాకు, అదో పెద్ద వింతవిశ్వమంటే తెలీని నాకు, బహుశా సముద్రమే విశ్వమంత అన్ని వైపులా నీరే కనపడుతుంటే, ఆదీ అంతమూ లేదేమో అన్నంతసుదూరానికి చూస్తుంటే, ఆకాశపుటంచుల్ని తాకుతున్నంత ముందుకేమో చేరుకోలేనంత, వెనక్కేమో తిరిగి వెళ్ళలేనంతగంట కునుకు తర్వాత లేచి చూసినా, ఒక అంగుళమైనా కదలనంత ఎంత దిగినా, లోతెంతో తెలియనంతభూమి అంటే నీరేనేమో, నేల కాదేమో అన్నంత సుడులు తిరిగే నీటిని చూస్తే, ఓ ప్రళయ మంతఊయలలూగే అలలను చూస్తే,Continue reading “సముద్రమెంత?”
ఓ బొజ్జ గణపయ్య
ఓ బొజ్జ గణపయ్య నీ దండు మేమయ్యనీ పండగంటేను మాకెంతొ ప్రియమయ్య! ఉత్తరము దక్షిణము తూరుపూ పశ్చిమమునీ భక్త జనకోటి మెండుగా ఉన్నాము! అమెరికా ఇంగ్లండు జాపాను యూరప్పుదేశమేదైనా పూజ నిష్ఠగా చేశాము! మూడైన ఐదైన ఏడైన ఎన్నైనప్రతి రాత్రి ఓ నవరాత్రి లాగుననిత్యహారతి నీకు పట్టించినాము! కుడుములూ ఉండ్రాళ్ళు చలివిడీ వడపప్పుచేయనే రాకున్న తీరికే లేకున్నబెల్లమూ పప్పులే నైవేద్యమిచ్చాము! నేరేడు మారేడు వెలగ తాంబూలమూఏదున్న లేకున్న ఉన్నదే అంతనుచుపూలనే భక్తితో పత్రిగా చేశాము! శ్లోకాలు పద్యాలుContinue reading “ఓ బొజ్జ గణపయ్య”
మన తరమే
I recently overheard a conversation of two college-going Telugu-speaking youth and it went something like this.. “నిన్ననే afternoon show కి వెళ్ళా. నువ్వు?” “నేను two days back already చూసేశా. taking మాత్రం super గా ఉందిరా. every scene లో richness కనపడింది. particular గా war sequence ఐతే ultimate.” “నాకైతే background music mind blowing. one or two songs కూడా బానేContinue reading “మన తరమే”
బామ్మ – మనవడు : Land of opportunities
బామ్మ: “హలో” మనవడు: “యేమిటే, ఈ టైంలో..” బా: “నిద్రపొయ్యావా? సరేగానీ, మరి.. మన డల్లాస్ నాగేశ్వర్రావ్ గారి మనవడి కొడుకు పుట్టినరోజు రేపు చేసుకుంటున్నారంట, ఒక సారి వెళ్ళి రారాదూ!” మ: “నేనిప్పుడు డల్లాస్ లో లేనే” బా: “అదే(, మొన్నీమధ్యేగా చికాగో సుబ్బారావ్ గారి వూరి నుంచి డల్లాస్ వచ్చానన్నావ్?” మ: “అది రెండు నెల్ల క్రితం మాట. ఇప్పుడు కొలరాడో అనీ ఇంకో ఊర్లో ఉంటున్నాలే” బా: “ఇదేమి కొలవెరి రా.. ఇలాContinue reading “బామ్మ – మనవడు : Land of opportunities”
బామ్మ – మనవడు : Quality of life
బామ్మ: “హలో..” మనవడు: “హలో..” బామ్మ: “ఏరా బడుధ్ధాయ్, యేం చేస్తున్నావ్” మనవడు: “ఆ( యేముందే, అమేరికాలో అందరు మగవాళ్ళు ఏం చేస్తారో, నేనూ అదే చేస్తున్నా” బామ్మ: “అర్ధం కాలా..!” మనవడు: “అదేనే, అంట్లు తోముతున్నా” బామ్మ: “అదేం? అప్పుడు.. అదేంటి.. అదేదో చెప్పి మరీ అమేరికా వెళ్ళావ్?” మనవడు: “అదా.. Quality of life అనీ..” బామ్మ: “అంటే?” మనవడు: “అది నీకర్ధం కాదులేవే.. సరే, నాకు బాత్రూంలో కొంచెం పని ఉంది, మళ్ళీContinue reading “బామ్మ – మనవడు : Quality of life”