తెలుగుభాష అంతరించిపోతోందని ఆవేదన చెందేవాళ్ళకీ
‘తెలుగువాడకం ఎలా పెంచాలా’ అని ఆలోచించేవాళ్ళకీ
కమ్మని పాట, తియ్యని పద్యం విని ఆనందించేవాళ్ళకీ
అచ్చతెలుగులో మాట్లాడేవాళ్ళని చూసి ఆరాధించేవాళ్లకీ
మనమూ తెలుగులోనే మాట్లాడాలని ఆరాటపడేవాళ్ళకీ
పిల్లలకి కూడా తెలుగు నేర్పాలని ఆవేశపడేవాళ్ళకీ
అది చేతకాక, సాధ్యంకాక లోలోనే ఆక్రందించేవాళ్ళకీ
‘అసలెందుకీ తెలుగు’ అనే ప్రశ్నకి సమాధానం చెప్పలేక అవస్థపడేవాళ్ళకీ
అంటే.. క్లుప్తంగా.. నాలాంటి తోటి భాషాభిమానులందరికీ..
అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవ శుభాకాంక్షలు!
మాతృభాష మాట్లాడేవాళ్ళందరికీ అభివందనాలు!!