విజయదశమి శుభాకాంక్షలు!

అందరికీ విజయం చేకూరాలని కోరుకుంటూ,
శుభాకాంక్షలు తెలుపుదామని మొదలుపెట్టా.
ఐతే, ఒక్క క్షణం సంశయించి, ఆగిపోయా.

“అందరికీ” విజయం.. అసలు అది ఎలా సాధ్యం?
ఏ పోటీలోనైనా, ఒకరికి విజయం చేకూరాలంటే, మరొకరికి పరాజయం తప్పదు కదా!

మరి, “అందరికీ విజయం ఎలా?” అని, ఆలోచించగా ఆలోచించగా నాకు బోధపడిన సత్యం..
మనకు పోటీ వేరెవరితోనో కాదని,
అది మనతోనే అని, మనలోనే అని!
ఆ పోటీ మంచికీ, చెడుకీ మధ్యే అని,
ఆ రెండూ మనలోనే ఉన్నాయని!
ఆ ‘చెడు’ని గెలిచే ‘మంచే’ అసలైన విజయమని!

ఆ అసలైన విజయం అందరికీ సిద్ధించాలని కోరుకుంటూ.. 
విజయదశమి శుభాకాంక్షలు!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: