Happy Valentine’s Day!

ఊహ వచ్చాక, ప్రేమంటే తెలిశాక
ఐదవ తరగతి నుంచీ దాదాపు పెళ్లయ్యేదాకా
అందీఅందని ప్రేమకోసం తపించే, పరితపించే
ఒక సగటు తెలుగబ్బాయి ప్రేమకథ, ఇది!

భవానీపేట

కనుచూపు మేరలో పచ్చదనం కాలుష్యం దరిచేరని వాతావరణం ముంగిట్లో పూల మొక్కలు పెరట్లో పళ్ళ తోటలు ఇంటి ముందే సాగర కాలువ ఆమడ దూరంలో సంగమ చెరువు కల్తీ కలవని పాలూ పెరుగు మందే ఎరుగని పళ్ళూ కూరలు అప్పుడే పట్టిన చేపల పులుసు అక్కడే కత్తిన నాటుకోడి వేపుడు నిన్నే తెంచిన బీర కూర మొన్నే ఈనిన గేదె జున్ను సన్నగా తురిమిన లేతకాకర మెత్తగా నూరిన కరివేపాకు గడ్డ పెరుగు కొసరి వడ్డన ఆహా!Continue reading “భవానీపేట”

యూసమేట్టి – జలపాతాలు

ఈ దేశంలో అట్టి పార్కు మరోటి లేదనిఎంతోమంది నాకు పట్టి పట్టి చెప్పగాచిన్ననాటి స్నేహితులతో జట్టుకట్టిఓ మినీవాను బాడుగ కట్టిపట్టుమని మూడు గంటలైనా గడవకముందేచేరుకున్న ఆ చిట్టడవేకట్టి పడేసే అందాల యూసమేట్టి పార్కునంతా కలియ జుట్టిమిట్టమధ్యాహ్నమైనా సరేపట్టువదలని విక్రమార్కుల్లాదట్టమైన చెట్టు నీడల సాయంతోమెట్టు మెట్టు ఎక్కుతూఎట్టకేలకు కొండపైకి చేరుకుంటేకళ్ళకు కట్టిన ఆ ఎత్తైన జలపాతాలతోనిరంతరం ఘోషించే యూసమేట్టి ఉరుకుల పరుగులతో బిరబిర జారే జలపాతాలను చూసినప్పుడు జాలువారిన ఈ చిరుకవితే: జలపాతాలు కరిగే మంచు ఉరికే నీరుమానవజాతికిContinue reading “యూసమేట్టి – జలపాతాలు”

అభిరామ దశకం

పదో ఏడు. పిల్లాడు పెద్దాడయ్యే ఈడు. బాల్యానికి దూరమౌతూ కౌమారానికి చేరువౌతుంటే.. అమాయకత్వమే తప్ప మరేదీ తెలీక, పరిచయంలేని మరో ప్రపంచం వైపు పరుగుపెడుతుంటే.. ఓ తండ్రి ఇచ్చే సూచన, దీవెన, బహుమానం.. అభిరామ దశకం. పెద్దలని గౌరవించు.. పద్ధతులని పాటించు! అల్పులని ఆదరించు.. తప్పులని మన్నించు! ఉన్నదాన్ని అనుభవించు.. లేనిదాన్ని విస్మరించు! ప్రతిభని గుర్తించు.. ఈర్ష్యని త్యజించు! పరిసరాలని గమనించు.. కీడెంచి మేలెంచు! మనసుని మందలించు.. బుధ్ధిని బుజ్జగించు! నిరంతరం శ్రమించు.. లక్ష్యాన్ని సాధించు! కష్టాన్నిContinue reading “అభిరామ దశకం”