ఐదవ తరగతి నుంచీ పెళ్లయ్యేదాకా, నాకు అందీ అందని సున్నితమైన ప్రేమని గుర్తుచేసుకుంటూ
Author Archives: Raghu Mendru
Happy New Year!
God is there.. all His ears! I am sure.. He will hear! Let me wish..loud and clear! May this year.. bring you more cheer! Oh my dear.. oh my dear! Wish you all.. a Happy New Year!
దీపావళి
కాకరొత్తులు మెరుస్తూచిచ్చుబుడ్లు వెలుగుతూటపాసులు పేలుతూభూవిష్ణు చక్రాలు తిరుగుతూఇంటిముందు దీపాలు వీధిలోని చీకటిని తరుముతుంటేఊరంతా దీపావళి! నరుడిలోనే నరకుడుమానవుడిలోనే మాధవుడుమనలోని నరకుణ్ణిమనలేని అసురుణ్ణి చేస్తూమనలోని మాధవుడు నిరంతరం ప్రయత్నిస్తేబ్రతుకంతా దీపావళి! ప్రమాదాలతో కాక, ప్రమోదాలతో మీరీ పండుగ చేసుకోవాలని ఆశిస్తూదీపావళి శుభాకాంక్షలు! If you find reading Telugu difficult, listen to my audio right here.
రక్షాబంధనం
జగమంతటికీ శ్రీరాముడే రక్ష చెల్లికి మాత్రం అన్నయ్యే శ్రీరామరక్ష! అన్నయ్యకి తాను చెల్లి తమ్మునికైతే ఆమే తల్లి!! ఆ అనుబంధాన్ని గుర్తు చేస్తూ, సోదరభావాన్ని పెంచేదే రక్షాబంధనం!!! అన్నాచెల్లెళ్లకి, అక్కాతమ్ముళ్ళకి, ఆడవాళ్ళని అక్కాచెల్లెళ్ళుగా భావించే అన్నాతమ్ముళ్ళకి రక్షాబంధన శుభాకాంక్షలు! If you find reading Telugu difficult, listen to my audio right here.
భవానీపేట
కనుచూపు మేరలో పచ్చదనం కాలుష్యం దరిచేరని వాతావరణం ముంగిట్లో పూల మొక్కలు పెరట్లో పళ్ళ తోటలు ఇంటి ముందే సాగర కాలువ ఆమడ దూరంలో సంగమ చెరువు కల్తీ కలవని పాలూ పెరుగు మందే ఎరుగని పళ్ళూ కూరలు అప్పుడే పట్టిన చేపల పులుసు అక్కడే కత్తిన నాటుకోడి వేపుడు నిన్నే తెంచిన బీర కూర మొన్నే ఈనిన గేదె జున్ను సన్నగా తురిమిన లేతకాకర మెత్తగా నూరిన కరివేపాకు గడ్డ పెరుగు కొసరి వడ్డన ఆహా!Continue reading “భవానీపేట”
యూసమేట్టి – జలపాతాలు
ఈ దేశంలో అట్టి పార్కు మరోటి లేదనిఎంతోమంది నాకు పట్టి పట్టి చెప్పగాచిన్ననాటి స్నేహితులతో జట్టుకట్టిఓ మినీవాను బాడుగ కట్టిపట్టుమని మూడు గంటలైనా గడవకముందేచేరుకున్న ఆ చిట్టడవేకట్టి పడేసే అందాల యూసమేట్టి యూసమేట్టి పార్కునంతా కలియ జుట్టిమిట్టమధ్యాహ్నమైనా సరేపట్టువదలని విక్రమార్కుల్లాదట్టమైన చెట్టు నీడల సాయంతోమెట్టు మెట్టు ఎక్కుతూఎట్టకేలకు కొండపైకి చేరుకుంటేకళ్ళకు కట్టిన ఆ ఎత్తైన జలపాతాలతోనిరంతరం ఘోషించే యూసమేట్టి యూసమేట్టి ఉరుకుల పరుగులతో బిరబిర జారే జలపాతాలను చూసినప్పుడు జాలువారిన ఈ చిరుకవితే: జలపాతాలు కరిగే మంచుContinue reading “యూసమేట్టి – జలపాతాలు”
సంక్రాంతి
పల్లెలు వదిలి పట్నాలెళ్తే, అవి ఉద్యోగాలు!పట్నాలు వదిలి పల్లెలకొస్తే, అవి పండుగలు!సాలుకి ఒకసారైనా ఊరంతా కలిస్తే, అదే సంక్రాంతి!పల్లెకు పూర్వ వైభవం తెచ్చే ఆ క్రాంతే, మకర సంక్రాంతి! మీ ఊళ్ళో ఉన్నా ఏ ఊళ్ళో ఉన్నా, ఈ సంక్రాంతి మీ ఇంట సుఖశాంతుల క్రాంతులు విరజిమ్మాలని ఆశిస్తూ.. సంక్రాంతి శుభాకాంక్షలు! If you find reading Telugu difficult, listen to my audio right here.
ప్రపంచ తెలుగు మహాసభలు – 2017
నాలాంటి ఒక సగటు తెలుగు భాషాభిమానికి, ఇలాంటి వేడుక ఒక పండుగతో సమానం! దీనిని ఇంత అట్టహాసంగా జరిపించటం ఆశ్చర్యకరం! అలాంటి వేడుకని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం రావటం నా అదృష్టం! తెలుగు భాష సంరక్షణకి ఎవరు నడుం బిగించినా, అది అభినందనీయం! ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న పొరపాట్లు సహజం, క్షమార్హం! కానీ, భాషకి ప్రాంతీయతని ఆపాదించడం అన్యాయం! ఎల్లలు లేని భాషకి గిరి గీయాలనుకోవడం మూర్ఖత్వం! పోతన, సోమన, కాళోజీ, సినారె, దాశరధి,Continue reading “ప్రపంచ తెలుగు మహాసభలు – 2017”
హారర్వే!
హ్యూస్టన్ పై హార్వే చాచిన కోరలు గాలీ వానల ఉధృత హోరులు గోదారులుగా మారిన రాదారులు సాయానికై ఎందరో అర్రులు అందించిన మరెందరో వీరులు ఐనా, రాబందుల్లా కొందరు చోరులు ఆందోళనలో నగర పౌరులు! ఎండిన గ్యాసు బోరులు వాహనదారులంతా బేజారులు బంకుల్లో బారులు తీరిన కారులు ఇబ్బందుల్లో ఇంకెన్నో ఊరులు! ప్రకృతికెందుకో మనపై అంత గుర్రులు శ్రుతిమించామనేమో, ఆ చిర్రు బుర్రులు! If you find reading Telugu difficult, listen to my audioContinue reading “హారర్వే!”
ఎవరు మృగం?
పులంటే భయం
తొండంటే జుగుప్స
పామంటే వణుకు
తోడేలంటే బెదురు
ముంగీసంటే కంగారు
ఒంటెఅంటే వాసన
గాడిదంటే చులకన
కానీ..