ప్రపంచ తెలుగు మహాసభలు – 2017

నాలాంటి ఒక సగటు తెలుగు భాషాభిమానికి, ఇలాంటి వేడుక ఒక పండుగతో సమానం! దీనిని ఇంత అట్టహాసంగా జరిపించటం ఆశ్చర్యకరం! అలాంటి వేడుకని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం రావటం నా అదృష్టం! తెలుగు భాష సంరక్షణకి ఎవరు నడుం బిగించినా, అది అభినందనీయం! ఇంత పెద్ద వేడుకలో చిన్న చిన్న పొరపాట్లు సహజం, క్షమార్హం! కానీ, భాషకి ప్రాంతీయతని ఆపాదించడం అన్యాయం! ఎల్లలు లేని భాషకి గిరి గీయాలనుకోవడం మూర్ఖత్వం! పోతన, సోమన, కాళోజీ, సినారె, దాశరధి,Continue reading “ప్రపంచ తెలుగు మహాసభలు – 2017”

హారర్వే!

హ్యూస్టన్ పై హార్వే చాచిన కోరలు గాలీ వానల ఉధృత హోరులు గోదారులుగా మారిన రాదారులు సాయానికై ఎందరో అర్రులు అందించిన మరెందరో వీరులు ఐనా, రాబందుల్లా కొందరు చోరులు ఆందోళనలో నగర పౌరులు! ఎండిన గ్యాసు బోరులు వాహనదారులంతా బేజారులు బంకుల్లో బారులు తీరిన కారులు ఇబ్బందుల్లో ఇంకెన్నో ఊరులు! ప్రకృతికెందుకో మనపై అంత గుర్రులు శ్రుతిమించామనేమో, ఆ చిర్రు బుర్రులు! If you find reading Telugu difficult, listen to my audioContinue reading “హారర్వే!”

ఏమంత కష్టం?

కష్టనష్టాలకోర్చి సంపాదించుకున్న కంప్యూటర్ ఉద్యోగాలూ ఆ సంపాదననే నమ్ముకుని బోలెడంత అప్పుచేసి కొన్న ఇల్లూ పిల్లవాడి భవిష్యత్తుకై కన్న కలలూ, పెంచుకున్న ఆశలూ చుట్టూ చెంతగా, అండగా ఉన్న స్నేహితులూ ఇక్కడే స్థిరపడొచ్చని ఒక్కొక్కరుగా వచ్చి దగ్గరైన బంధువులూ వాళ్ళతో తరచుగా జరిపే విహారాలూ, వినోదాలూ.. ఒక్కసారిగా.. “మీవి కాదం”టే.. “మీరు వద్దు, పో పొమ్మం”టే ఎంత కష్టం, ఎంత నష్టం? ఉద్యోగాలు లాగేసుకుంటున్నారంటూ, ఆస్తులు కూడబెట్టుకుంటున్నారంటూ తమ సంస్కృతిలో కలవట్లేదంటూ, మీ వేషభాషలు వదలట్లేదంటూ కల్లబొల్లిContinue reading “ఏమంత కష్టం?”

ళుల్లు

ప్రేయసీ ప్రియులు. కాఫీ షాపు. చేతుల్లో చేతులు. కళ్ళల్లో కళ్ళు. “రవీ.. నీకు అన్నిటికంటే ఏది ఇష్టం?” “కల్లు..” “ఛీ.. తాగుతావా?” “ఆ కల్లు కాదు.. నీ కల్లు” “ఓహో” “మరి.. నీకేమంటే ఇష్టం?” “కలలు..” “ఏం.. కంటావా?” “అవి కాదు.. కలలు, arts” “ఆహా” ‘దొందూ దొందేరా కొందప్పా’.. అనుకున్నాడు అటుగా వెళ్తున్న ఓ తెలుగు పంతులు. ***** తల్లిదండ్రులు. పిల్లల్ని కొత్తగా ‘మనబడి’లో చేర్చారు. “hi, కల్యాన్!” “hey, కిరన్!” “మీ వాన్ని కూడాContinue reading “ళుల్లు”

భలే మంచి రోజు

సగం మూసిన కిటికీ తెరల నుంచి బారెడు పొద్దెక్కిన సూరీడు నిద్దర లేపుతుంటే, “బద్ధకం కూడా ఇంత హాయిగా ఉంటుందా?” అరుదుగా తప్ప ఇలాంటి అవకాశం రాని నేను, ‘పక్కపై ఇంకాసేపు దొర్లితే  తప్పేంట’నుకుంటున్నపుడు, దిండుపై రాలిన జుట్టు రాబోయే దశాబ్దిని గుర్తు చేయగా, తాపత్రయ పడే అర్ధాంగి తయారుచేసిన ఉల్లిపాయ గుజ్జుతో కాబోయే అరగుండుని కప్పేసి, ‘తలపై ఉండనిది ముఖంమీద మాత్రం ఎందుక’ని, కసితో క్షవరించి, ఆపై తలంటి, ‘నువ్వు.. నువ్వు.. నువ్వే.. నువ్వు..’ లాంటిContinue reading “భలే మంచి రోజు”

శ్రీ దుర్ముఖి నామ ఉగాది శుభాకాంక్షలు

తీపి, పులుపు, ఉప్పు, కారం, చేదు, వగరు – ఉగాది ప్రేమ, సరసం, నమ్మకం, చురక, తగువు, అలక – కాపురం ఆరోహణం, విరోధం, విరామం, ఊడిగం, విరమణం, అవరోహణం – ఉద్యోగం సంతోషం, ఉల్లాసం, సుఖం, కోపం, దుఖం, కష్టం – జీవితం అన్నీ సమపాళ్ళల్లో తీసుకున్నప్పుడు, ప్రతిదీ పండుగే, ప్రతిరోజూ ఉగాదే!

అభిరామ దశకం

పదో ఏడు. పిల్లాడు పెద్దాడయ్యే ఈడు. బాల్యానికి దూరమౌతూ కౌమారానికి చేరువౌతుంటే.. అమాయకత్వమే తప్ప మరేదీ తెలీక, పరిచయంలేని మరో ప్రపంచం వైపు పరుగుపెడుతుంటే.. ఓ తండ్రి ఇచ్చే సూచన, దీవెన, బహుమానం.. అభిరామ దశకం. పెద్దలని గౌరవించు.. పద్ధతులని పాటించు! అల్పులని ఆదరించు.. తప్పులని మన్నించు! ఉన్నదాన్ని అనుభవించు.. లేనిదాన్ని విస్మరించు! ప్రతిభని గుర్తించు.. ఈర్ష్యని త్యజించు! పరిసరాలని గమనించు.. కీడెంచి మేలెంచు! మనసుని మందలించు.. బుధ్ధిని బుజ్జగించు! నిరంతరం శ్రమించు.. లక్ష్యాన్ని సాధించు! కష్టాన్నిContinue reading “అభిరామ దశకం”