అమ్మానాన్నా..
మీ దాంపత్యం మాకు ఆదర్శం
మీ అనురాగం మాకు సుధాగానం
మీ మమకారం మాకు నయగారం
మీ ప్రేమ మాకు లాలి
మీ ముచ్చట మాకు జోల
మీ సహనం మాకు మార్గం
మీ శ్రమ మాకు పెట్టుబడి
మీ పొదుపు మాకు ఆస్తి
మీ త్యాగం మాకు ఫలం
కానీ..
మీ కలహం మాకు దుఃఖం
మీ నలత మాకు కలత
మీ బాధ మాకు వ్యధ
మీ మౌనం మాకు అగమ్యం
మీ కోపం మాకు భయం
మీ నష్టం మా వెంట
మీ కష్టం మాదంట
మీ బాష్పం మా కంట
అందుకే..
మీ అన్యోన్యం మా సంకల్పం
మీ ఆరోగ్యం మా కర్తవ్యం
మీ ఆనందం మా ఆశయం
మీ సౌఖ్యం మా లక్ష్యం
ఎన్నేళ్ళైనా తొలినాళ్లలా ఉండాలన్నదే మా ఆకాంక్ష!
మీ 48వ పెళ్లిరోజున ఇదే మా అందరి శుభాకాంక్ష!!
If you find reading Telugu difficult, listen to my audio right here.