కాకరొత్తులు కాలుస్తూ
చిచ్చుబుడ్లు వెలిగిస్తూ
టపాకాయలు పేలుస్తూ
భూవిష్ణు చక్రాలు తిప్పుతూ
ఇంటిముందు దీపాలు వీధిలోని చీకటిని తరుముతుంటే
ఇంటింటా దీపావళి!
నరుడిలోనే నరకుడు
మానవుడిలోనే మాధవుడు
మనలోని నరకుణ్ణి మనలేని అసురుణ్ణి చేస్తూ
మనలోని మాధవుడు ప్రతి ఏటా ప్రయత్నిస్తే
ఏటేటా దీపావళి!
ప్రమాదాలతో కాక, ప్రమోదాలతో మీరీ పండుగ చేసుకోవాలని ఆశిస్తూ
దీపావళి శుభాకాంక్షలు!