Happy Valentine’s Day!

Listen to my audio of this blog on Spotify or Google Podcasts

ఊహ వచ్చాక, ప్రేమంటే తెలిశాక
ఐదవ తరగతి నుంచీ దాదాపు పెళ్లయ్యేదాకా
అందీఅందని ప్రేమకోసం తపించే, పరితపించే
ఒక సగటు తెలుగబ్బాయి ప్రేమకథ, ఇది!


ఐదునే అగుపించింది.. చూపు తిప్పుకోలేకపోయా!
ఏడున ఎదురైంది.. అడ్డు తప్పుకోలేకపోయా!
పదిలో పక్కనే కూర్చుంది.. కానీ, నోరు విప్పలేకపోయా, మాట చెప్పలేకపోయా!

ఇంటర్ లో ఇంటెదురే.. తుంటరి కోరికలెన్నో!
కోచింగ్ లో కంటెదురే.. కొంటె చూపులెన్నో!
కాలేజ్ మొత్తం  కళకళే .. కానీ, పోటీలో మాయదారి గుంపులెన్నో!

పక్కింట్లో పారిజాతం.. రోజంతా కంటికింపు!
వీధిచివర్లో విరజాజి.. మనసంతా గుబాళింపు!
ఊరి నిండా తామరలే.. కానీ, అడుసుకి జడిసి మనసుకి మందలింపు!

బస్సులో పక్కపక్కనే.. శబ్దం కాదది సంగీతం!
రైల్లో ఎదురెదురే.. వేగం కాదది గుండెచప్పుడు!
ప్రతి ప్రయాణంలోనూ ప్రణయమే.. కానీ, గమ్యమెప్పుడూ అర్ధంతరమే!

అలా.. బహుశా పాతికేళ్లుగా అందీ అందని ప్రేమామృతాన్ని
మీకు జీవితాంతం అందించేలా సొంతమైన మీ ప్రియపత్నినే
మీరు మీ వాలెంటైన్ గా భావిస్తున్నారని ఆశిస్తూ..

ప్రేమించుకునే భార్యాభర్తలందరికీ Happy Valentine’s Day!

(this is a slightly modified version of what I wrote 2 yrs ago.)

Leave a comment