My Valentine!

Audio of the writing, for those who cannot read.

ఐదునే అగుపించింది.. చూపు తిప్పుకోలేకపోయా!
ఏడున ఎదురైంది.. అడ్డు తప్పుకోలేకపోయా!
పదిలో పక్కనే కూర్చుంది.. కానీ, నోరు విప్పలేకపోయా!

ఇంటర్ లో ఇంటెదురే.. తుంటరి ఆలోచనలెన్నో!
కోచింగ్ లో కంటెదురే.. కొంటె చూపులెన్నో!
కాలేజ్ మొత్తం  కళకళే.. కానీ, పోటీలో మాయదారి గుంపులెన్నో!

పక్కింట్లో పారిజాతం.. రోజంతా కంటికింపు!
వీధిచివర్లో విరజాజి.. మనసంతా గుబాళింపు!
ఊరి నిండా తామరలే.. కానీ, అడుసుకి జడిసి మనసుకి మందలింపు!

బస్సులో పక్క సీటే.. శబ్దం కాదది సంగీతం!
రైల్లో ఎదురు బెర్తే.. వేగం కాదది గుండెచప్పుడు!
ప్రతి ప్రయాణంలోనూ ప్రణయమే.. కానీ, గమ్యమెప్పుడూ అర్ధంతరమే!

అలా పాతికేళ్లుగా అందీ అందని ప్రేమామృతాన్ని
నాకు జీవితాంతం అందించేలా నా సొంతమైన నువ్వే.. నా నిజమైన Valentine!

Happy Valentine’s Day!

2 thoughts on “My Valentine!

Leave a reply to Raghu M Cancel reply