సముద్రమెంత?

Listen to my audio of this blog on Spotify or Google Podcasts

మొదటి సారి మహా సముద్రయానం చేసిన నాకు, అదో పెద్ద వింత
విశ్వమంటే తెలీని నాకు, బహుశా సముద్రమే విశ్వమంత

అన్ని వైపులా నీరే కనపడుతుంటే, ఆదీ అంతమూ లేదేమో అన్నంత
సుదూరానికి చూస్తుంటే, ఆకాశపుటంచుల్ని తాకుతున్నంత

ముందుకేమో చేరుకోలేనంత, వెనక్కేమో తిరిగి వెళ్ళలేనంత
గంట కునుకు తర్వాత లేచి చూసినా, ఒక అంగుళమైనా కదలనంత

ఎంత దిగినా, లోతెంతో తెలియనంత
భూమి అంటే నీరేనేమో, నేల కాదేమో అన్నంత

సుడులు తిరిగే నీటిని చూస్తే, ఓ ప్రళయ మంత
ఊయలలూగే అలలను చూస్తే, మనసంతా ఓ పులకింత

ఎప్పుడూ నేలపై ఉండే నాకు, గోళాంతర వాసమే ఇదంతా
నేల చాలని మనకు, నీరు కాదా మరో చెంత

ఇంతటి విశాల సముద్రమ్ముందు, అసలు నువ్వెంత నేనెంత
నీదీ నాదని  పంచుకోవాలనుకునే అల్పులమే కదా మనమంతా!

5 thoughts on “సముద్రమెంత?

Leave a reply to Raghu M Cancel reply