కవనం: కనుకుంట్ల సుభాష్ (చంద్రబోస్)
చిత్రం: రంగస్థలం
గానం: గొర్తి దేవీశ్రీ ప్రసాద్
సంగీతం: గొర్తి దేవీశ్రీ ప్రసాద్
ఏరుశనగ కోసం మట్టిని తవ్వితే
ఏకంగా తగిలిన లంకెబిందె లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
సింతసెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే
సేతికి అందిన సందమామ లాగ
ఎంత సక్కగున్నావే లచ్చిమి ఎంత సక్కగున్నావే
మల్లెపూల మధ్య ముద్దబంతి లాగ ఎంత సక్కగున్నావే
ముత్తైదువ మెళ్ళో పసుపుకొమ్ము లాగ ఎంత సక్కగున్నావే
సుక్కలసీర కట్టుకున్న ఎన్నెలలాగ ఎంత సక్కగున్నావే
రెండుకాళ్ళ సినుకువి నువ్వు గుండెసెర్లో దూకేసినావు
అలలమూటలిప్పేసినావు ఎంత సక్కగున్నావే
మబ్బులేని మెరుపువి నువ్వు నేల మీద నడిసేసినావు
నన్ను నింగి సేసేసినావు ఎంత సక్కగున్నావే
సెరుకుముక్క నువ్వు కొరికి తింటావుంటే ఎంత సక్కగున్నావే
సెరుకుగడకే తీపి రుసి తెలిపినావే ఎంత సక్కగున్నావే
తిరునాళ్ళలో తప్పి ఏడ్సేటి బిడ్డకు ఎదురొచ్చిన తల్లి సిరునవ్వు లాగ ఎంత సక్కగున్నావే
గాలి పల్లకిలో ఎంకిపాట లాగ ఎంకిపాట లోన తెలుగుమాట లాగ ఎంత సక్కగున్నావే
కడవ నువ్వు నడుమున బెట్టి కట్టమీద నడిసొత్తా వుంటే
సంద్రం నీ సంకెక్కినట్టూ ఎంత సక్కగున్నావే
కట్టెలమోపు తలకెత్తుకోని అడుగులోన అడుగేత్తా వుంటే
అడవి నీకు గొడుగట్టినట్టూ ఎంత సక్కగున్నావే
బురదసేలో వరినాటు ఏత్తావుంటే ఎంత సక్కగున్నావే
భూమిబొమ్మకి నువ్వు ప్రాణం పోస్తున్నట్టు ఎంత సక్కగున్నావే
విశ్లేషణ
సంవత్సరం: 2018
రసం: అందం
అక్షరం: య, వ
గుర్తింపు: