కవనం: వేటూరి సుందరరామమూర్తి
చిత్రం: మాతృదేవోభవ
గానం: క్రిష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర
సంగీతం: కొండూరి మరకతమణి కీరవాణి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోతాను గగనానికి
మమతలన్నీ మౌనగానం
వాంఛలన్నీ వాయులీనం
ఏడుకొండలకైనా బండదారొక్కటే
ఏడుజన్మల తీపి ఈ బంధమే
నీ కంటిలో నలతలో వెలుగునే కనక
నేను నేననుకుంటే ఎద చీకటే
హరీ హరీ హరీ
రాయినై ఉన్నాను ఈనాటికీ
రామపాదము రాక ఏనాటికీ
నీరు కన్నీరాయె
ఊపిరే బరువాయె
నిప్పు నిప్పుగ మారె నా గుండెలో
ఆ నింగిలో కలిసి నా శూన్యబంధాలు
పుట్టిల్లు చేరె మట్టి ప్రాణాలు
హరీ హరీ హరీ
రెప్పనై ఉన్నాను మీ కంటికి
పాపనై వస్తాను మీ ఇంటికి
వేణువై వచ్చాను భువనానికి
గాలినై పోయాను గగనానికి
విశ్లేషణ
వాయులీనం = violin
సంవత్సరం: 1993
రసం: కరుణ
అక్షరం: వ
గుర్తింపు: మనస్విని పురస్కారం