తొలిసారి మిమ్మల్ని (శ్రీవారికి ప్రేమలేఖ)

కవనం వేటూరి సుందరరామమూర్తి
చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ
గానం: శిష్ట్ల జానకి
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు


శ్రీమన్ మాహారాజ మార్తాండతేజా, ప్రియానందభోజా
మీ శ్రీచరణాంభోజములకు
ప్రేమతో నమస్కరించి, మిము వరించి, మీ గురించి
ఎన్నో కలలుగన్న కన్నె బంగారు
భయముతో, భక్తితో, అనురక్తితో శాయంగల విన్నపములు

సంధ్యారాగం చంద్రహారతి పడుతున్న వేళ
మసకచీకటి మధ్యమావతి పాడుతున్న వేళ
ఓ శుభముహూర్తాన

తొలిసారి మిమ్మల్ని చూసింది మొదలు
కదిలాయి మదిలోన ఎన్నెన్నో కధలు

జో అచ్యుతానంద జో జో ముకుందా
లాలి పరమానంద రామ గోవిందా జో జో

నిదురపోని కనుపాపలకు జోల పాడలేక
ఈలవేసి చంపుతున్న ఈడునాపలేక
ఇన్నాళ్ళకు రాస్తున్నా ప్రేమలేఖ

ఏ తల్లి కుమారులో తెలియదుగానీ
ఎంతటి సుకుమారులో తెలుసునాకు
ఎంతటి మగధీరులో తెలియలేదుగానీ
నా మనసును దోచిన చోరులు మీరు
వలచివచ్చిన వనితను చులకన చేయక
తప్పులుంటె మన్నించి, ఒప్పులుగా భావించి
చప్పున బదులివ్వండి

తలలోన తురుముకున్న తుంటరి మల్లె
తలపులలో ఎన్నెన్నో మంటలు రేపె
సూర్యుడి చుట్టూ తిరిగే భూమికి మల్లే
నా ఊర్పుల నిట్టూర్పుకు జాబిలి వాడే
నీ జతనే కోరుకునే లతలాగా అల్లుకునే
నాకు మీరు మనసిస్తే, ఇచ్చినట్టు మాటిస్తే
ఇప్పుడే బదులివ్వండి


విశ్లేషణ

మార్తాండ తేజ = సూర్య ప్రకాశం, sunshine
భోజ = రాజు, king
చరణాంభోజములు = పాదపద్మములు, feet
అనురక్తి = ప్రేమ, love


సంవత్సరం: 1984
రసం: విరహం
అక్షరం: స
గుర్తింపు: నంది పురస్కారం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: