కవనం: చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: సొంతం
గానం: క్రిష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర
సంగీతం: గొర్తి దేవీశ్రీ ప్రసాద్
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏమిటో అని బయటపడలేక
ఎలా ఎలా దాచివుంచేది, ఎలా ఎలా దాన్ని ఆపేది
అతడు ఎదురైతే ఏదో జరిగిపోతోంది
పెదవిచివరే పలకరింపు నిలిచిపోతోంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు
ఇంతవరకూ లేదుగా ఇపుడు ఏమైందో
కనివినీ ఎరుగని చిలిపి అలజడి నిలపలేక
గుండె లోతుల్లో ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతడి తలపే నిండిపోయింది
నిన్నదాకా ఎప్పుడూ నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా
విశ్లేషణ
సంవత్సరం: 2002
రసం: ప్రేమ
అక్షరం: త
గుర్తింపు: