కవనం: శ్రీరంగం శ్రీనివాసరావు (శ్రీ శ్రీ)
చిత్రం: అల్లూరి సీతారామరాజు
గానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, విస్సంరాజు రామకృష్ణ
సంగీతం: పెనుపాత్రుని ఆదినారాయణరావు
తెలుగువీర లేవరా, దీక్షబూని సాగరా
దేశమాత స్వేచ్ఛకోరి తిరుగుబాటు చేయరా
దారుణ మారణకాండకు తల్లడిల్లవద్దురా
నీతిలేని శాసనాలు నేటినుండి రద్దురా
నిదురవద్దు బెదరవద్దు నింగి నీకు హద్దురా
ఎవడువాడు ఎచటివాడు ఇటువచ్చిన తెల్లవాడు
కండబలం కొండబలం కబళించే దుండగీడు
మానధనం ప్రాణధనం దోచుకునే దొంగవాడు
తగినశాస్తి చెయ్యరా తరిమితరిమి కొట్టరా
ఈదేశం ఈరాజ్యం నాదే అని చాటించి
ప్రతిమనిషీ తొడలుగొట్టి శృంఖలాలు పగులగొట్టి
చురకత్తులు పదునుపట్టి తుదిసమరం మొదలుపెట్టి
సింహాలై గర్జించాలి సంహారం సాగించాలి
వందేమాతరం వందేమాతరం
స్వాతంత్య్ర వీరుడా స్వరాజ్య భానుడా అల్లూరి సీతారామరాజా
అందుకో మా పూజలందుకో రాజ అల్లూరి సీతారామరాజా
తెల్లవాడి గుండెల్లో నిదురించినవాడా
మా నిదురించిన పౌరుషాగ్ని రగిలించినవాడా
త్యాగాలే వరిస్తాం, కష్టాలే భరిస్తాం
నిశ్చయముగ నిర్భయముగ నీ వెంటనె నడుస్తాం
విశ్లేషణ
తల్లడిల్లు = to be harassed
కబళించు = దౌర్జన్యంతో తీసుకొను, to snatch
శృంఖలాలు = ఇనుప గొలుసులు, iron chains
భానుడు = సూర్యుడు, the Sun
సంవత్సరం: 1974
రసం: విప్లవం
అక్షరం: త
గుర్తింపు: జాతీయ పురస్కారం