కవనం: చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: శ్రుతిలయలు
గానం: కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్
సంగీతం: క్రిష్ణన్ కోయిల్ వెంకటాచలం మహదేవన్
తెలవారదేమో స్వామీ
నీ తలపుల మునుకలో అలసిన దేవేరి
అలమేలు మంగకు తెలవారదేమో స్వామీ
చెలువమునేలగ చెంగట లేవని
కలతకు నెలవై నిలచిన నెలతకు
కలల అలజడికి నిద్దుర కరవై
అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామీ
మక్కువమీరగ అక్కునజేరిచి
అంగజుకేళిని పొంగుచు తేల్చగ
ఆ మత్తునే మది మరి మరి తలచగ
అలసిన దేవేరి అలమేలు మంగకు తెలవారదేమో స్వామీ
విశ్లేషణ
శ్రుతి = tune
లయ = rhythm
దేవేరి = దేవి, queen
చెలువము = అందము, beauty
చెంగట = చెంత, close by
కలత = disturbance
నెలత = స్త్రీ, woman
మక్కువమీరగ = ప్రేమ ఎక్కువై, with increased affection
అంగజుకేళి = మన్మధుని ఆట (శృంగారం), romance
సంవత్సరం: 1987
రసం: విరహం
అక్షరం: త
గుర్తింపు: నంది పురస్కారం