సురాజ్యమవలేని (గాయం)

కవనం చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: గాయం
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ కొమ్మినేని)


సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని
సుఖాన మనలేని వికాసమెందుకని
నిజాన్ని బలికోరే సమాజమెందుకని
అడుగుతోంది అదిగో ఎగిరే భరతపతాకం

ఆవేశంలో ప్రతినిమిషం ఉరికే నిప్పుల జలపాతం
కత్తికొనల ఈ వర్తమానమున బ్రతకదు శాంతికపోతం
బంగరుభవితకు పునాది కాగల యువత ప్రతాపాలు
భస్మాసుర హస్తాలై ప్రగతికి సమాధి కడుతుంటే
శిరసు వంచెనదిగో ఎగిరే భరతపతాకం
చెరుగుతోంది ఆ తల్లి చరితలో విశ్వవిజయాల విభవం

కులమతాల దవానలానికి కరుగుతున్నది మంచుశిఖరం
కలహముల హాలాహలానికి మరుగుతున్నది హిందుసంద్రం
దేశమంటే మట్టి కాదను మాట మరచెను నేటి విలయం
అమ్మ భారతి బలిని కోరిన రాచకురుపీ రాజకీయం
విషము చిమ్మెను జాతి తనువున ఈ వికృత గాయం


విశ్లేషణ

సురాజ్యం = మంచి రాజ్యం
కపోతం = పావురం, pigeon
దవానలం = wildfire
హాలాహలం = విషం, poison
రాచకురుపు = carbuncle
విలయం = destruction


సంవత్సరం: 1993
రసం: ఆవేశం
అక్షరం: స
గుర్తింపు: నంది పురస్కారం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: