కవనం: చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: స్వర్ణకమలం
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులిపాక సుశీల
సంగీతం: ఇళయరాజా
శివపూజకు చివురించిన సిరిసిరి మువ్వా మృదుమంజుల పదమంజరి పూచిన పువ్వా యతిరాజుకు జతిస్వరముల పరిమళమివ్వ నటనాంజలితో బ్రతుకును తరించనీవా
పరుగాపక పయనించవె తలపుల నావ కెరటాలకు తలవంచితె తరగదు త్రోవ ఎదిరించిన సుడిగాలిని జయించినావా మదికోరిన మధుసీమలు వరించిరావా
పడమర పడగలపై మెరిసే తారలకై రాత్రిని వరించకే సంధ్యాసుందరీ తూరుపు వేదికపై వేకువ నర్తకివై ధాత్రిని మురిపించే కాంతులు చిందనీ నీ కదలిక చైతన్యపు శ్రీకారం కానీ నిదురించిన హృదయరవళి ఓంకారం కానీ
తన వేళ్ళే సంకెళ్ళై కదలలేని మొక్కలా ఆమనికై ఎదురుచూస్తు ఆగిపోకు ఎక్కడా అవధిలేని అందముంది అవనికి నలుదిక్కులా ఆనందపు గాలివాలు నడపనీ నిన్నిలా ప్రతిరోజొక నవగీతిక స్వాగతించగా వెన్నెల కిన్నెర గానం నీకు తోడుగా
చరణ చలిత జనితం నీ సహజ విలాసం జ్వలిత కిరణ కలితం సౌందర్య వికాసం నీ అభినయ ఉషోదయం తిలకించిన రవి నయనం గగనసరసి హృదయములో వికసిత శతదళ శోభల సువర్ణకమలం
విశ్లేషణ
యతిరాజు = శివుడు, Lord Shiva కలితం = పొందబడిన, possessed of
సంవత్సరం: 1988
రసం: చైతన్యం
అక్షరం: శ
గుర్తింపు: