కవనం: వేటూరి సుందరరామమూర్తి
చిత్రం: శంకరాభరణం
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్
శంకరా!
నాదశరీరా పరా వేదవిహారా హరా జీవేశ్వరా
ప్రాణము నీవని, గానమె నీదని, ప్రాణమె గానమని
మౌన విచక్షణ, ధ్యాన విలక్షణ, రాగమే యోగమని
నాదోపాసన చేసినవాడను, నీవాడను నేనైతే
దిక్కరీంద్రజిత హిమగిరీంద్ర సితకందరా నీలకంధరా
క్షుద్రులెరుగని రుద్రవీణ నిర్ణిద్ర గానమిది అవధరించరా
విని తరించరా
మెరిసే మెరుపులు మురిసే పెదవుల చిరు చిరు నవ్వులు కాబోలు
ఉరిమే ఉరుములు సరి సరి నటనల సిరి సిరి మువ్వలు కాబోలు
పరవశాన శిరసూగంగ ధరకు జారెనా శివగంగ
నా గానలహరి నువు మునుగంగ
ఆనందవృష్టి నే తడవంగ
విశ్లేషణ
దిక్కరీంద్రజిత = దిక్కులని జయించినవాడు, who conquered all directions
సితకందర = handsome
కంధర = మెడ, neck
నిర్ణిద్ర = eternal
అవధరించు = ఆలకించు, listen
ధర = భూమి, the earth
వృష్టి = వర్షం, rain
సంవత్సరం: 1979
రసం: భక్తి
అక్షరం: శ
గుర్తింపు: నంది పురస్కారం