కవనం: కనుకుంట్ల సుభాష్ (చంద్రబోస్)
చిత్రం: రంగస్థలం
గానం: మానసి మహదేవన్
సంగీతం: గొర్తి దేవీశ్రీ ప్రసాద్
రంగమ్మా మంగమ్మా ఏం పిల్లడు
పక్కనే ఉంటాడమ్మ పట్టించుకోడు
గొల్లభామ ఒచ్చి గోరు గిల్లుతుంటే
గొల్లభామ ఒచ్చి నా గోరు గిల్లుతుంటే
పుల్లచీమ కుట్టి నా పెదవి సలుపుతుంటే
ఉఫ్ఫమ్మా ఉఫ్ఫమ్మా అంటూ ఊదడు
ఉత్తమాట కైనా నన్ను ఊర్కోబెట్టడు
ఆడి పిచ్చిపిచ్చి ఊసులోన మునిగి తేలుతుంటే
మర్చిపోయి మిరపకాయ కొరికినానంటే
మంటమ్మా మంటమ్మా అంటే సూడడు
మంచినీళ్ళైనా సేతికీయడు
రామచిలకమ్మ రేగిపండు కొడుతుంటే
రేగిపండు గుజ్జు వచ్చి కొత్తగా సుట్టుకున్న రైక మీద పడుతుంటే
రామచిలకమ్మ రేగిపండు కొడితే రేగిపండు గుజ్జు నా రైక మీద పడితే
మరకమ్మా మరకమ్మా అంటే సూడడు
మారు రైకైనా తెచ్చి ఇయ్యడు
నా అందమంతా మూటగట్టి కందిసేనుకే ఎళితే
ఆ కందిరీగలొచ్చి ఆడ ఈడ గుచ్చి నన్ను సుట్టుముడుతుంటే
నా అందమంతా మూటగట్టి కందిసేనుకెళితే కందిరీగలొచ్చి నన్ను సుట్టుముడుతుంటే
ఉష్షమ్మా ఉష్షమ్మా అంటూ తోలడు
ఉలకడు పలకడు బండరాముడు
విశ్లేషణ
గొల్లభామ = పచ్చని పురుగు, a species of grasshopper
సంవత్సరం: 2018
రసం: విరహం
అక్షరం: ర
గుర్తింపు: