రామా కనవేమిరా (స్వాతిముత్యం)

కవనం సింగిరెడ్డి నారాయణరెడ్డి
చిత్రం: స్వాతిముత్యం
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శ్రీపతి పండితారాధ్యుల శైలజ
సంగీతం: ఇళయరాజా


రామా కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా
రమణీ లలామ నవలావణ్య సీమ
ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా

సీతాస్వయంవరం ప్రకటించిన పిమ్మట
జనకుని కొలువులో ప్రవేశించే జానకిని సభాసదులందరూ పదేపదే చూడగా
శ్రీరామచంద్రమూర్తి
కన్నెత్తి చూడడేమని అనుకుంటున్నారట తమలో సీతమ్మ అనుంగు చెలికత్తెలు

ముసిముసి నగవుల రసిక శిఖామణులు
ఒసపరి చూపుల అసదృశ విక్రములు
మీసం మీటే రోష పరాయణులు
మా సరి ఎవరను మత్తగుణోల్బణులు
క్షణమే ఒక దినమై, నిరీక్షణమే ఒక యుగమై
తరుణి వంక శివధనువు వంక తమ తనువు మరచి కనులు తెరచి చూడగ
రామా కనవేమిరా

ముందుకేగి విల్లందబోయి ముచ్చెమటలు పట్టిన దొరలు, భూవరులు
తొడగొట్టి ధనువు చేబట్టి బావురని గుండెలు జారిన విభులు
విల్లెత్తలేక మొగమెత్తలేక సిగ్గేసిన నరపుంగవులు
తమ వొళ్ళూ వొరిగి రెండు కళ్ళూ తిరిగి వొగ్గేసిన పురుషాగ్రణులు
ఎత్తేవారు లేరా, విల్లు ఎక్కుపెట్టేవారు లేరా

రామాయ రామభద్రాయ రామచంద్రాయ నమః
అంతలో రామయ్య లేచినాడు, వింటిమీద చెయ్యి వేసినాడు
సీతవంక ఓరకంట చూసినాడు, ఒక్క చిటికెలో విల్లు ఎక్కుపెట్టినాడు
ఫెళ ఫెళ విరిగెను శివధనువు, కళలొలికెను సీతా నవవధువు
జయజయ రామా, రఘుకుల సోమా, దశరధ రామా, దైత్య విరామా

సీతాకళ్యాణ వైభోగమే శ్రీరామకళ్యాణ వైభోగమే
కనగ కనగ కమనీయమే
అనగ అనగ రమణీయమే
సీతాకళ్యాణ వైభోగమే శ్రీరామకళ్యాణ వైభోగమే

రామయ్యా అదిగోనయ్యా
రమణీ లలామ నవలావణ్య సీమ
ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా
రామా కనవేమిరా, శ్రీ రఘురామ కనవేమిరా


విశ్లేషణ

రమణీ లలామ= {రమణి = అందమైన స్త్రీ, beautiful woman}+{లలామ = శ్రేష్ఠమైన, excellent} = the most beautiful woman
సుమగాత్రి = పువ్వులాంటి దేహముగల స్త్రీ, woman as sensitive as flower
అనుంగు = ప్రియమైన, dear
ఒసపరి = సుందరుడు, handsome man
అసదృశ = అసమానమైన, incomparable
విక్రములు = శూరులు, heroes
మత్తగుణోల్బణులు = {మత్తగుణం = మదము పట్టిన, arrogant}+{ఉల్బణులు = అతిశయము కలవారు, people with pride} = arrogant and pride people
వొగ్గేసిన = వొదిలేసిన, given up
వింటిమీద = విల్లు + మీద
దైత్య విరామ = {దైత్య = రాక్షసుడు, daemon}+{విరామ = one who stops} = రాక్షస అంతకుడు


సంవత్సరం: 1986
రసం: జానపదం
అక్షరం: ర
గుర్తింపు:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: