కవనం: వేటూరి సుందరరామమూర్తి
చిత్రం: సీతారామయ్యగారి మనవరాలు
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, క్రిష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర
సంగీతం: కోడూరి మరకతమణి కీరవాణి
పూసింది పూసింది పున్నాగ
పూసంత నవ్వింది నీలాగ
సందేళ లాగేసె సల్లంగ దాని సన్నాయి జళ్ళోన సంపెంగ
ముల్లోకాలే కుప్పెలై జడకుప్పెలై
ఆడ జతులాడ
ఇష్టసఖి నా చిలుక నీ పలుకే బంగారంగా
అష్టపదులే పలికే నీ నడకే వయ్యారంగా
కలిసొచ్చేటి కాలాల కౌగిళ్ళలో కలలొచ్చాయిలే
కలలొచ్చేటి నీకంటి పాపాయిలే కథ చెప్పాయిలే
అనుకోని రాగమే అనురాగ దీపమై
వలపన్న గానమే ఒక వాయులీనమై
పాడె మది పాడె
పట్టుకుంది నా పదమే నీ పదమే పారాణిగా
కట్టుకుంది నా కవితే నీ కళలే కళ్యాణిగా
అరవిచ్చేటి ఆ భేరి రాగాలకే స్వరమిచ్చావులే
ఇరుతీరాల గోదారి గంగమ్మకే అలలిచ్చావులే
అల ఎంకి పాటలే ఇల పూల తోటలై
పసిమొగ్గ రేకులే పరువాల చూపులై
పూసె విరబూసె
విశ్లేషణ
సంవత్సరం: 1991
రసం: ప్రేమ
అక్షరం: ప
గుర్తింపు: