కవనం: వేటూరి సుందరరామమూర్తి
చిత్రం: చంటి
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం:కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ)
పావురానికి పంజరానికి పెళ్లిచేసె పాడులోకం
కాళరాత్రికి చందమావకి ముళ్ళుపెట్టె మూఢలోకం
కొడిగట్టిన దీపాలే గుడి హారతులయ్యేనా
తానిచ్చు పాలలో ప్రేమంతా కలిపి సాకింది నా కన్నతల్లి
లాలించు పాటలో నీతంతా తెలిపి పెంచింది నాలోన మంచి
కపటాలు మోసాలు నాలోన లేవు కలనైనా అపకారి కాను
చేసిన పాపములా ఇవి ఆ విధి శాపములా
మారని జాతకమా ఇది దేవుని శాసనమా
ఇది తీరేదే కాదా
తాళంటే తాడని తలచాను నాడు అది ఏదో తెలిసేను నేడు
ఆ తాళి పెళ్లికే ఋజువన్న నిజము తరువాత తెలిసేమి ఫలము
ఏమైనా ఏదైనా జరిగింది ఘోరం నా మీద నాకేలే కోపం
నా తొలి నేరములా ఇవి తీరని వేదనలా
నా మది లోపములా ఇవి ఆరని శోకములా
ఇక ఈ బాధే పోదా
విశ్లేషణ
కొడిగట్టిన = వత్తి కాలిపోగా మిగిలిన కాంతి తగ్గిన, fading light of a lamp
సంవత్సరం: 1992
రసం: కరుణ
అక్షరం: ప
గుర్తింపు: నంది పురస్కారం