కవనం: భాగవతుల సదాశివశంకర శాస్త్రి (ఆరుద్ర)
చిత్రం: బందిపోటు
గానం: ఘంటసాల వేంకటేశ్వరరావు, పులపాక సుశీల
సంగీతం: ఘంటసాల వేంకటేశ్వరరావు
ఊహలు గుసగుసలాడే
నా హృదయము ఊగిసలాడే
ప్రియా
వలదన్న వినదీమనసు
కలనైన నిన్నే తలచు
తొలిప్రేమలో బలముందిలే
అది నీకు మునుపే తెలుసు
ననుకోరి చేరిన బేల
దూరాన నిలిచేవేల
నీ ఆనతి లేకున్నచో
విడలేను ఊపిరి కూడా
దివి మల్లెపందిరి వేసె
భువి పెళ్లిపీటలు వేసె
నెరవెన్నెల కురిపించుచూ
నెలరాజు పెండ్లిని చేసె
ఊహలు గుసగుసలాడే
మన హృదయములూయలూగే
విశ్లేషణ
బేల = అమాయకురాలు, simpleton
నెరవెన్నెల = నిండు వెన్నెల, full moonlight
నెలరాజు = చంద్రుడు, moon
సంవత్సరం: 1963
రసం: ప్రేమ
అక్షరం: ఉ
గుర్తింపు: