ఓంకార నాదానుసంధానమౌ (శంకరాభరణం)

కవనం: వేటూరి సుందరరామమూర్తి
చిత్రం
: శంకరాభరణం
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్ల జానకి
సంగీతం: కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్


ఓం ఓం
ఓంకారనాదానుసంధానమౌ గానమే శంకరాభరణము
శంకర గళ నిగళము, శ్రీహరి పదకమలము
రాగరత్న మాలికా తరళము శంకరాభరణము

శారదవీణారాగచంద్రికా పులకిత శారదరాత్రము
నారద నీరద మహతీనినాద గమకిత శ్రావణగీతము
రసికులకనురాగమై, రసగంగలో తానమై
పల్లవించు సామవేద మంత్రము శంకరాభరణము

అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి గానమె సోపానము
సత్వ సాధనకు, సత్య శోధనకు సంగీతమే ప్రాణము
త్యాగరాజ హృదయమై, రాగరాజ నిలయమై
ముక్తి నొసగు భక్తి యోగ మార్గము
మృతియె లేని సుధాలాప స్వర్గము శంకరాభరణము


విశ్లేషణ

అనుసంధానమౌ = స్మరించు, reciting
నిగళము
= గొలుసు, chain
మాలికా
= దండ, garland
తరళము
= ప్రకాశించునది,  shining
శారద రాత్రము = వెన్నెల రాత్రి, moonlit night
నీరద
= మేఘం, cloud
మహతీ
= నారదుని వీణ, musical instrument played by Naarada maharshi
గమకిత = గమకాలు నిండిన, filled with nuances of musical notes
తానమై
= స్నానము చేసి, bathe
సత్వ
= సత్వ గుణము, quality of excellence
సుధాలాప
  = అమృతం లాంటి  ఆలాపము, divine song


సంవత్సరం: 1979
రసం: భక్తి
అక్షరం: ఓ
గుర్తింపు:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: