కవనం: కిలంబి వెంకట నరసింహాచార్యులు (ఆచార్య ఆత్రేయ)
చిత్రం: డాక్టర్ చక్రవర్తి
గానం: పులపాక సుశీల
సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
నీవులేక వీణ పలుకలేనన్నది
నీవురాక రాధ నిలువలేనన్నది
జాజిపూలు నీకై రోజు రోజు పూచె
చూచి చూచి పాపం సొమ్మసిల్లిపోయె
చందమామ నీకై తొంగి తొంగి చూచి
సరసను లేవని అలుకలుబోయె
కలలనైన నిన్ను కనులచూతమన్న
నిదురరాని నాకు కలలు కూడ రావె
కదలలేని కాలం విరహగీతి రీతి
పరువము వృధగా బరువుగ సాగె
తలుపులన్ని నీకై తెరచివుంచినాను
తలపులెన్నొ మదిలో దాచివేసినాను
తాపమింక నేను ఓపలేను స్వామీ
తరుణిని కరుణను యేలగ రావా
విశ్లేషణ
జాజిపూవు = flowering jasmine
సొమ్మసిల్లిపోవు = to faint
రీతి = విధంగా, manner
తాపం = fire of love
తరుణి = యువతి, young woman
సంవత్సరం: 1964
రసం: విరహం
అక్షరం: న
గుర్తింపు: