కవనం: కనుకుంట్ల సుభాష్ (చంద్రబోస్)
చిత్రం: ఆది
గానం: మల్లికార్జున్, ఉపద్రష్ట సునీత
సంగీతం: మణి శర్మ
నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు
నీ పెదవుల ఎర్రదనాన్ని గోరింటాకే అరువడిగింది
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు
నీ కోకను సీతాకోక
నీ పలుకును చిలకల మూక
నీ చూపును చంద్రలేఖ
నీ కొంగును ఏరువాక
బదులిమ్మంటూ బతిమాలాయి
ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు
అసలివ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు
నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు
నా వైపే మొగ్గిన నీకైతే, అవి మొత్తం ఇవ్వచ్చు
నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు
నా కోసం వేచే నీకైతే, అది రాశిగ ఇవ్వచ్చు
భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
నీకే మొక్కే నాకే ఇవ్వచ్చు
నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు
మరి నాకై పుట్టిన నీకైతే, అది పూర్తిగ ఇవ్వచ్చు
నీ భారం మోసే అదృష్టాన్నే భూమికి సైతం ఇవ్వద్దు
నేనంటే మెచ్చిన నీకైతే, అది వెంటనె ఇవ్వచ్చు
నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చు
నా వాకిట ముగ్గులు నీకే
నా దోసిట మల్లెలు నీకే
నా పాపిట వెలుగులు నీకే
నా మాపటి మెరుపులు నీకే
ప్రాయం ప్రణయం ప్రాణం నీకే
ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
విశ్లేషణ
సంవత్సరం: 2002
రసం: ప్రేమ
అక్షరం: న
గుర్తింపు: నంది పురస్కారం