కవనం: చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: అల్లుడుగారు
గానం: కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్, క్రిష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర
సంగీతం: క్రిష్ణన్ కోయిల్ వెంకటాచలం మహదేవన్
ముద్దబంతి నవ్వులో మూగబాసలు
మూసివున్న రెప్పలపై ప్రేమలేఖలు
చదువుకునే మనసుంటే ఓ కోయిలా
మధుమాసమే ఔతుంది అన్ని వేళలా
బంధమంటూ ఎరుగని బాటసారికి
అనుబంధమై వచ్చింది ఒక దేవత
ఇంత చోటులోనే అంత మనసు ఉంచి
నా సొంతమే అయ్యింది ప్రియురాలిగా
అందమైన తొలిరేయి స్వాగతానికి
మౌనగీతమై వచ్చింది పెళ్లికూతురు
ఎదుటనైన పడలేని గడ్డి పువ్వును
గుడిలోనికి రమ్మంది ఈ దైవము
మాట నోచుకోని ఒక పేదరాలిని
ఈ గుండెలో నిలిపావు గృహలక్ష్మిగా
విశ్లేషణ
మూగబాస = మూగ సంకేతం, silent sign
మధుమాసం = చైత్రమాసం, beginning of spring
సంవత్సరం: 1990
రసం: ప్రేమ
అక్షరం: మ
గుర్తింపు: