కవనం: చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: సిరివెన్నెల
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం భాగవతార్ మహదేవన్
మెరిసే తారలదేరూపం
విరిసే పూవులదేరూపం
అది నా కంటికి శూన్యం
మనసున కొలువై మమతల నెలవై వెలసిన దేవిది యే రూపం
నా కన్నులు చూడని రూపం
గుడిలో దేవత ప్రతిరూపం, నీ రూపం, అపురూపం
ఎవరి రాకతో గళమున పాటల ఏరువాక సాగేనో
ఆ వసంతమాసపు కులగోత్రాలను ఎల కోయిల అడిగేనా
ఎవరి పిలుపుతో పులకరించి పురివిప్పి తనువు ఊగేనో
ఆ తొలకరి మేఘపు గుణగణాలకై నెమలి వెదుకులాడేనా
ప్రాణం పుట్టుక ప్రాణికి తెలియాలా
గానం పుట్టుక గాత్రం చూడాలా
వెదురును మురళిగ మలచి
ఈ వెదురును మురళిగ మలచి
నాలో జీవననాదం పలికిన నీవే నా ప్రాణస్పందన
నీకే నా హృదయ నివేదన!
విశ్లేషణ
ఏరువాక = దుక్కి ప్రారంభం, commencement of cultivation
ఎల = లేత, young
మురళి = పిల్లనగ్రోవి, flute
నివేదించు = convey
సంవత్సరం: 1986
రసం: ప్రేమ
అక్షరం: మ
గుర్తింపు: