కవనం: వేటూరి సుందరరామమూర్తి
చిత్రం: శ్రీవారికి ప్రేమలేఖ
గానం: శిష్ట్ల జానకి
సంగీతం: పసుపులేటి రమేష్ నాయుడు
మనసా తుళ్ళిపడకే, అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో
ఆ శుభఘడియ వచ్చేనో రాదో
తొందరపడితే అలుసే మనసా తెలుసా
ఏమంత అందాలు కలవని వస్తాడు నిన్ను వలచి
ఏమంత సిరి వుంది నీకని మురిసేను నిన్ను తలచి
చదువా పదవా ఏముంది నీకు
తళుకూ కులుకూ ఏదమ్మ నీకు
శ్రుతిమించకే నీవు మనసా
ఏ నోము నోచావు నీవని దొరికేను ఆ ప్రేమ ఫలము
ఏ దేవుడిస్తాడు నీకని అరుదైన అంత వరము
మనసా వినవే మహ అందగాడు
తనుగా జతగా మనకందిరాడు
కలలాపవే కన్నె మనసా
విశ్లేషణ
సంవత్సరం: 1984
రసం: విరహం
అక్షరం: మ
గుర్తింపు: