కవనం: దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
చిత్రం: సీతామాలక్ష్మి
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
సంగీతం: క్రిష్ణన్ కోయిల్ వెంకటాచలం మహదేవన్
మావిచిగురు తినగానే కోవిల పలికేనా
కోవిలగొంతు వినగానే మావి చిగురు తొడిమేనా
ఏమో ఎమనునోగానీ ఆమని ఈ వని
తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా సయ్యాటలా తారాటలా
వన్నెలేకాదు వగలేకాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు బిడియాలు పొంకాలు పోడుములు
ఏమో ఎవ్వరిదోగానీ ఈ విరి గడసరి
ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల
ఉయ్యాల జంపాల జంపాల ఉయ్యాల
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలు పులకరింతలు
ఏమో ఏమగునోగానీ ఈ కథ మన కథ
విశ్లేషణ
తొడుము = చిగురించు, to sprout
ఆమని = వసంతం, spring
వని = అడవి, forest
తెమ్మెర = చల్లగాలి, cool breeze
తారాట = play
బింకం = గర్వం, pride
బిడియం = సిగ్గు, shyness
పొంకం = ఠీవి, style
పోడిమి = elegance
విరి = పువ్వు, flower
దివిటీ = torch
సంవత్సరం: 1978
రసం: ప్రేమ
అక్షరం: మ
గుర్తింపు: నంది పురస్కారం