మావిచిగురు తినగానే (సీతామాలక్ష్మి)

కవనం దేవులపల్లి వేంకట కృష్ణశాస్త్రి
చిత్రం: సీతామాలక్ష్మి
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
సంగీతం: క్రిష్ణన్ కోయిల్ వెంకటాచలం మహదేవన్


మావిచిగురు తినగానే కోవిల పలికేనా
కోవిలగొంతు వినగానే మావి చిగురు తొడిమేనా
ఏమో ఎమనునోగానీ ఆమనివని

తెమ్మెరతో తారాటలా తుమ్మెదతో సయ్యాటలా
తారాటలా సయ్యాటలా సయ్యాటలా తారాటలా
వన్నెలేకాదు వగలేకాదు ఎన్ని నేర్చినది మొన్నటి పువ్వు
బింకాలు బిడియాలు పొంకాలు పోడుములు
ఏమో ఎవ్వరిదోగానీ ఈ విరి గడసరి

ఒకరి ఒళ్ళు ఉయ్యాల వేరొకరి గుండె జంపాల
ఉయ్యాల జంపాల జంపాల ఉయ్యాల
ఒకరి పెదవి పగడాలో వేరొకరి కనుల దివిటీలో
పలకరింతలు పులకరింతలు
ఏమో ఏమగునోగానీ ఈ కథ మన కథ


విశ్లేషణ

తొడుము = చిగురించు, to sprout
ఆమని = వసంతం, spring
వని = అడవి, forest
తెమ్మెర = చల్లగాలి, cool breeze
తారాట = play
బింకం = గర్వం, pride
బిడియం = సిగ్గు, shyness
పొంకం = ఠీవి, style
పోడిమి = elegance
విరి = పువ్వు, flower
దివిటీ = torch


సంవత్సరం: 1978
రసం: ప్రేమ
అక్షరం: మ
గుర్తింపు: నంది పురస్కారం

Leave a comment