కవనం: వెన్నెలకంటి రాజేశ్వరప్రసాద్
చిత్రం: మహర్షి
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్ల జానకి
సంగీతం: ఇళయరాజా
మాటరాని మౌనమిది.. మౌనవీణ గానమిది గానమిది నీ ధ్యానమిది.. ధ్యానములో నా ప్రాణమిది.. ప్రాణమైన మూగగుండె రాగమిది
ముత్యాలపాటల్లొ కోయిలమ్మ.. ముద్దారబోసేది ఎప్పుడమ్మా ఆ పాలనవ్వుల్లొ వెన్నెలమ్మ.. దీపాలు పెట్టేది ఎన్నడమ్మా ఈ మౌనరాగాల ప్రేమావేశం ఏనాడో ఒకరి సొంతం ఆకాశదీపాలు జాబిలి కోసం నీకేల ఇంత పంతం నింగి నేల కూడేవేళ, నీకూ నాకూ దూరాలేల అందరాని కొమ్మ ఇది, కొమ్మచాటు అందమిది మాటరాని మౌనమిది మౌనవీణ గానమిది
చైత్రాన కూసేను కోయిలమ్మ.. గ్రీష్మానికాపాట ఎందుకమ్మా రేయంత నవ్వేను వెన్నెలమ్మ... నీరెండకానవ్వు దేనికమ్మా రాగాల తీగల్లొ వీణానాదం కోరింది ప్రణయవేదం వేసారు గుండెల్లొ రేగే గాయం పాడింది మధురగేయం ఆకాశాన తారాతీరం అంతేలేని ఎంతో దూరం
మాటరాని మౌనమిది.. మౌనవీణ గానమిది అందరాని కొమ్మ ఇది.. కొమ్మచాటు అందమిది కూడనిది జతకూడనిది.. చూడనిది మదిపాడనిది.. చెప్పరాని చిక్కుముడి వీడనిది
విశ్లేషణ
వేసారు = విసిగి పోవు, frustrated
సంవత్సరం:1987
రసం: ప్రేమ, విషాదం
అక్షరం: మ
గుర్తింపు: