కవనం: వేటూరి సుందరరామమూర్తి
చిత్రం: పంతులమ్మ
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
సంగీతం: రాజన్, నాగేంద్ర
మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం
సాగరమధనం అమృతమధురం సంగమ సరిగమ స్వరపారిజాతం
ఏ రాగమో ఏమో మన అనురాగం వలపు వసంతాన హృదయపరాగం
ఎదలోయలలో నిదురించిన నా కోరిక పాడే కోయిలగీతం
శతవసంతాల దశదిశాంతాల సుమసుగంధాల భ్రమరనాదాల
కుసుమించు నీ అందమే విరిసింది అరవిందమై కురిసింది మకరందమే
జాబిలికన్నా నా చెలి మిన్న పులకింతలకే పూచిన పొన్న
కానుకలేమి నేనివ్వగలను కన్నులకాటుక నేనవ్వగలను
పాలకడలిలా వెన్నెల పొంగింది పూల పడవలా నా తనువూగింది
ఏ మల్లెలతీరాల నిను చేరగలను మనసున మమతై కడతేరగలను
కురిసేదాకా అనుకోలేదు శ్రావణ మేఘమని
తడిసేదాకా అనుకోలేదు తీరని దాహమని
కలిసేదాకా అనుకోలేదు తీయని స్నేహమని
పెదవి నేనుగా పదము నీవుగా ఎదలు పాడనీ
మానసవీణా మధుగీతం మన సంసారం సంగీతం
సాగరమధనం అమృతమధురం సంగమ సరిగమ స్వరపారిజాతం
విశ్లేషణ
పరాగం = పుప్పొడి, pollen of a flower
భ్రమర = తుమ్మెద, humblebee
అరవిందం = తామర, lotus
పొన్న = పొన్న చెట్టు, a tree(Alexandrian laurel)
సంవత్సరం: 1977
రసం: ప్రేమ
అక్షరం: మ
గుర్తింపు: నంది పురస్కారం