లాలీ లాలీ లాలీ లాలీ (స్వాతిముత్యం)

కవనం సింగిరెడ్డి నారాయణరెడ్డి
చిత్రం: స్వాతిముత్యం
గానం: పులపాక సుశీల
సంగీతం: ఇళయరాజా


లాలీ లాలీ లాలీ లాలీ

వటపత్రశాయికి వరహాల లాలి
రాజీవనేత్రునికి రతనాల లాలి
మురిపాలకృష్ణునికి ముత్యాల లాలి
జగమేలుస్వామికి పగడాల లాలి

కళ్యాణరామునికి కౌసల్య లాలి
యదువంశవిభునికి యశోద లాలి
కరిరాజముఖునికి గిరితనయ లాలి
పరమాంశభవునికి పరమాత్మ లాలి

జోజో జోజో జో

అలమేలుపతికి అన్నమయ్య లాలి
కోదండరామునికి గోపయ్య లాలి
శ్యామలాంగునికి శ్యామయ్య లాలి
ఆగమనుతునికి త్యాగయ్య లాలి


విశ్లేషణ

వటపత్రశాయి = మర్రి ఆకు పై పడుకొను విష్ణువు, Lord Vishnu
రాజీవనేత్రుడు = తామర కన్నుల శ్రీనివాసుడు, Lord Srinivasa
యదువంశవిభుడు = యదువంశానికి ప్రభువు శ్రీ కృష్ణుడు, Lord Krishna
కరిరాజముఖుడు = ఏనుగు ముఖముగల వినాయకుడు, Lord Ganesha
పరమాంశభవుడు = ఆది దైవం శివుడు, Lord Shiva
శ్యామలాంగుడు = పార్వతీదేవి జ్యేష్ఠపుత్రుడు వినాయకుడు, Lord Ganesha
శ్యామయ్య = నల్లనివాడు శివుడు, Lord Shiva
ఆగమనుతుడు = రాముడు, Lord Rama


సంవత్సరం: 1986
రసం: జోల
అక్షరం: ల
గుర్తింపు:

3 thoughts on “లాలీ లాలీ లాలీ లాలీ (స్వాతిముత్యం)

  1. జోలపాట….1986లో నా బాబును జో కొట్టాను ఈ రోజు నా మనవడికి 2020 పాడుతున్నాను కృతఘ్నతలు

    Like

  2. నారాయణరెడ్డి గారి కలంనుండి జాలువారిన జోల పాటలో పరమాత్మను కీర్తించిన వగ్గేయ కారులను కీర్తించిన తీరు ….సుశీలమ్మ గాత్రం…… రాజా గారి సంగీతం…. అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఆణిముత్యం….. శంకర్ ఆర్…..

    Like

  3. నాకు అగమనుతునికి అర్ధం తెలియలేదు ..మీరు ఇచ్చిన విశ్లేషణ వలన తెలిసినది ధన్యవాదాలు..

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: