కవనం: కనుకుంట్ల సుభాష్ (చంద్రబోస్)
చిత్రం: మనం
గానం: మాస్టర్ భరత్
సంగీతం: అనూప్ రూబెన్స్
కనిపెంచిన మా అమ్మకే అమ్మయ్యానుగా
నడిపించిన మా నాన్నకే నాన్నయ్యానుగా
ఒకరిది కన్ను ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటిచూపు
ఒకరిది మాట ఒకరిది భావం ఇరువురి కదలిక కదిపిన కథ
ఇది ప్రేమా ప్రేమా తిరిగొచ్చే తీయగా
ఇది ప్రేమా ప్రేమా ఎదురొచ్చే హాయిగా
ఇది మనసుని తడిమిన తడిపిన క్షణము కదా
అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకి గురువును ఔతున్నా
అడుగులు నడకలు నేర్పిన నాన్నకి మార్గం ఔతున్నా
పిల్లలు వీళ్ళే ఔతుండగా ఆ అల్లరి నేనే చూస్తుండగా
కన్నోళ్ళతో నేను చిన్నోడిలా కలగలిసిన ఎగసిన బిగిసిన కథ
కమ్మని బువ్వని కలిపిన చేతిని దేవత అంటున్నా
కన్నుల నీటిని తుడిచిన వెలికి కోవెల కడుతున్నా
జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా
మీరూపిన ఆ ఊయల నా హృదయపు లయలలో పదిలము కదా
విశ్లేషణ
సంవత్సరం: 2014
రసం: కరుణ
అక్షరం: క
గుర్తింపు: ఫిలింఫేర్ పురస్కారం