కవనం: చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: నువ్వే కావాలి
గానం: క్రిష్ణన్ నాయర్ శాంతకుమారి చిత్ర
సంగీతం: సాలూరి కోటేశ్వరరావు (కోటి)
కళ్ళల్లోకి కళ్ళుపెట్టి చూడవెందుకు
చెప్పలేని గుండెకోత పోల్చుకుందుకు
మనం అన్నది ఒకేమాటని నాకిన్నాళ్ళు తెలుసు
నువ్వూ నేను ఇద్దరున్నామంటే
నమ్మనంటు ఉంది మనసు
ఈనాడే సరికొత్తగా మొదలైందా మన జీవితం
గతమంటూ ఏం లేదని చెరిగిందా ప్రతీ జ్ఞాపకం
కనులు మూసుకుని ఏం లాభం, కలైపోదుగా ఏ సత్యం
ఎటూ తేల్చని నీ మౌనం, ఎటో తెలియని ప్రయాణం
ప్రతిక్షణం ఎదురయే నన్నే దాటగలదా
గాలిపటం గగనానిదా ఎగరేసే ఈ నేలదా
నా హృదయం నీ చెలిమిదా, ముడివేసే ఇంకొకరిదా
నిన్నా మొన్నలన్నీ నిలువెల్లా నిత్యం నిన్ను తడిమేవేళ
తడే దాచుకున్న మేఘంలా ఆకాశాన నువ్వు ఎటువున్నా
చినుకులా కరగక శిలై ఉండగలవా
విశ్లేషణ
సంవత్సరం: 2000
రసం: కరుణ
అక్షరం: క
గుర్తింపు: