జగమంత కుటుంబం నాది (చక్రం)

కవనం చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: చక్రం
గానం: కొమ్మినేని శ్రీనివాస చక్రవర్తి (శ్రీ కొమ్మినేని)
సంగీతం: గిల్ల చక్రధర్ (చక్రి)


జగమంత కుటుంబం నాది, ఏకాకి జీవితం నాది
సంసారసాగరం నాదే సన్యాసం శూన్యం నాదే

కవినై, కవితనై, భార్యనై, భర్తనై
మల్లెలదారిలో మంచుఎడారిలో
పన్నీటి జయగీతాల కన్నీటి జలపాతాల
నాతో నేను అనుగమిస్తూ, నాతో నేనే రమిస్తూ
ఒంటరినై అనవరతం కంటున్నాను నిరంతరం
కలల్ని, కథల్ని, మాటల్ని, పాటల్ని
రంగుల్ని, రంగవల్లుల్ని, కావ్యకన్యల్ని, ఆడపిల్లల్ని

మింటికి కంటిని నేనై, కంటను మంటను నేనై
మంటలమాటున వెన్నెల నేనై, వెన్నెలపూతల మంటను నేనై
రవినై, శశినై, దివమై, నిశినై
నాతో నేను సహగమిస్తూ నాతో నేనే రమిస్తూ
ఒంటరినై ప్రతినిమిషం కంటున్నాను నిరంతరం
కిరణాల్ని కిరణాల హరిణాల్ని హరిణాల
చరణాల్ని చరణాల చలనాల కనరాని గమ్యాల కాలాన్ని ఇంద్రజాలాన్ని


విశ్లేషణ

అనుగమించు = అనుసరించు, to follow
అనవరతం = ఎల్లప్పుడు, constantly
మింటికి (మిన్ను) = ఆకాశం, the sky
రవి = సూర్యుడు, the sun
శశి = చంద్రుడు, the moon
దివము = పగలు, day
నిశి = రాత్రి, night
హరిణాలు = జింకలు, deers
ఇంద్రజాలం = magic


సంవత్సరం: 2005
రసం: వేదాంతం
అక్షరం: జ
గుర్తింపు: నంది పురస్కారం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: