జానకి కలగనలేదు (రాజకుమార్)

కవనం కిలంబి వెంకట నరసింహాచార్యులు (ఆచార్య ఆత్రేయ)
చిత్రం: రాజకుమార్
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
సంగీతం: ఇళయరాజా


జానకి కలగనలేదు రాముని సతికాగలనని ఏనాడు
రాముడు అనుకోలేదు జానకి పతికాగలనని ఆనాడు
ఆనాడు ఎవరూ అనుకోనిది ఈనాడు మనకు నిజమైనది
ఆ రామాయణం మన జీవన పారాయణం

చెలిమనసే శివధనుసైనది తొలిచూపుల వశమైనది
వలపు స్వయంవరమైనపుడు గెలువనిది ఏది
ఒక బాణము ఒక భార్యన్నది శ్రీరాముని స్థిరయశమైనది
శ్రీవారు ఆ వరమిస్తే సిరులన్నీ నావే
తొలిచుక్కవు నీవే చుక్కానివి నీవే
తుదిదాకా నీవే మరుజన్మకు నీవే

సహవాసం మనకు నివాసం సరిహద్దు నీలాకాశం
ప్రతిపొద్దు ప్రణయావేశం పెదవులపై హాసం
సుమసారం మన సంసారం మణిహారం మన మమకారం
ప్రతిరోజు ఒక శ్రీకారం పరవశ శృంగారం
గతమంటే నీవే కథకానిది నీవే
కలలన్నీ నావే కలకాలం నీవే


విశ్లేషణ

యశము = కీర్తి, prosperity
సుమసారం = పువ్వు తేనె, nectar


సంవత్సరం: 1983
రసం: ప్రేమ
అక్షరం: జ
గుర్తింపు:

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: