కవనం: కిలంబి వెంకట నరసింహాచార్యులు (ఆచార్య ఆత్రేయ)
చిత్రం: మంచి మనసులు
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్ల జానకి
సంగీతం: ఇళయరాజా
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
రామయ్య ఎదలో రాగాల మాలై పాడాలి నేను పాటనై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనిషిక్కడ మనసక్కడ ఇన్నాళ్ళైనా
నీ ఊసులనే నా ఆశలుగా
నా ఊహలనే నీ బాసలుగా
అనుకొంటిని కలగంటిని నే వెర్రిగా
నే కన్న కలలు నీ కళ్ళతోనే
నాకున్న తావు నీ గుండెలోనే
కాదన్న నాడు నేనే లేను
నా వయసొక వాగైనది నా వలపొక వరదైనది
నా మనసొక నావైనది ఆ వెల్లువలో
ఈ వెల్లువలో ఏమౌతానో
ఈ వేగంలో ఎటు పోతానో
ఈ నావకు నీ చేరువ తావున్నదో
తెరచాప నువ్వై నడిపించుతావో
దరిచేర్చి నన్ను ఒడి చేర్చుతావో
నట్టేట ముంచి నవ్వేస్తావో
జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై
నిను కానలేక మనసూరుకోక పాడాను నేను పాటనై
నువ్వక్కడ నేనిక్కడ పాటిక్కడ పలుకక్కడ
మనసొక్కటి కలిసున్నది ఏనాడైనా
ఈ పువ్వులనే నీ నవ్వులుగా
ఈ చుక్కలనే నీ కన్నులుగా
నునునిగ్గుల ఈ మొగ్గలు నీ బుగ్గలుగా
ఊహల్లొ తేలి ఉర్రూతలూగి
మేఘాలతోటి రాగాల లేఖ
నీకంపినాను రావా దేవీ
నీ పేరొక జపమైనది నీ ప్రేమొక తపమైనది
నీ ధ్యానమె వరమైనది ఎన్నాళ్ళైనా
ఉండీ లేక ఉన్నది నీవే
ఉన్నా కూడా లేనిది నేనే
నా రేపటి అడియాశల రూపం నీవే
దూరాన ఉన్నా నా తోడు నీవే
నీ దగ్గరున్న నీ నీడ నాదే
నాదన్నదంతా నీవే నీవే
విశ్లేషణ
ఊసు = సంగతి, affair
బాస = సంకేతం, sign
తావు = స్థానం, place
నావ = పడవ, boat
తెరచాప = ship’s sail
నిగ్గు = కాంతి, brightness
ఉర్రూతలూగి = తన్మయత్వంతో ఊగి, rock in ecstacy
అడియాశ = వ్యర్థమైన ఆశ, vain desire
సంవత్సరం: 1985
రసం: విరహం, బాధ
అక్షరం: జ
గుర్తింపు: