కవనం: భువన చంద్ర
చిత్రం: పెద్దరికం
గానం: కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్, స్వర్ణలత
సంగీతం: తోటకూర సోమరాజు-సాలూరి కోటేశ్వరరావు (రాజ్-కోటి)
ఇదేలే తరతరాల చరితం
జ్వలించే జీవితాల కథనం
పగేమో ప్రాణమయ్యేనా
ప్రేమలే దూరమయ్యేనా
నిరాశే నింగికెగసేనా
ఆశలే రాలిపోయేనా
ఒడిలో పెరిగిన చిన్నారినే
ఎరగా చేసినదా ద్వేషము
కథ మారదా ఈ బలి ఆగదా
మనిషే పశువుగ మారితే
కసిగా శిశువుని కుమ్మితే
అభమూ శుభమూ ఎరుగని వలపులు ఓడిపోయేనా
విరిసీ విరియని పూదోటలో
రగిలే మంటలు చల్లారవా
ఆర్పేదెలా ఓదార్చేదెలా
నీరే నిప్పుగ మారితే
పగలే చీకటి రువ్వితే
పొగలో సెగలో మమతల పూవులు కాలిపోయేనా
విశ్లేషణ
సంవత్సరం: 1992
రసం: కరుణ
అక్షరం: ఇ
గుర్తింపు: