కవనం: దాసరి నారాయణరావు
చిత్రం: స్వయంవరం
గానం: కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్
సంగీతం: చెళ్ళపిళ్ళ సత్యనారాయణ శాస్త్రి (సత్యం)
గాలివానలో వాననీటిలో పడవప్రయాణం
తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం
ఇటు హోరుగాలి అని తెలుసు
అటు వరదపొంగు అని తెలుసు
హోరుగాలిలో వరదపొంగులో సాగలేనని తెలుసు
అది జోరువాన అని తెలుసు
ఇవి నీటి సుడులని తెలుసు
జోరువానలో నీటి సుడులలో మునక తప్పదని తెలుసు
ఐనా పడవప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం
ఇది ఆశ నిరాశల ఆరాటం
అది చీకటి వెలుగుల చెలగాటం
ఆశ జారినా వెలుగు తొలగినా ఆగదు జీవితపోరాటం
ఇది మనిషీ మనసుల పోరాటం
అది ప్రేమా పెళ్ళీ చెలగాటం
ప్రేమ శకలమై మనసు వికలమై బ్రతుకుతున్నదొక శవం
ఐనా పడవప్రయాణం తీరమెక్కడో గమ్యమేమిటో తెలియదు పాపం
విశ్లేషణ
చెలగాటం = ఆట, sport
శకలము = broken piece
వికలము = కలవరం, sorrowful
సంవత్సరం: 1982
రసం: కరుణ
అక్షరం: గ
గుర్తింపు: