కవనం: చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: సిరివెన్నెల
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
సంగీతం: కృష్ణన్‌కోయిల్ వెంకటాచలం మహదేవన్
ఈ గాలి ఈ నేల ఈ ఊరు సెలయేరు
ననుగన్న నా వాళ్ళు నా కళ్ళ లోగిళ్ళు
చిన్నారి గొరవంక కూసేను ఆవంక
నా రాక తెలిసాక వచ్చేను నా వంక
ఎన్నాళ్ళో గడిచాక ఇన్నాళ్ళకు కలిశాక
ఉప్పొంగిన గుండెల కేక
ఎగసేను నింగి దాక
ఏనాడు ఏ శిల్పి కన్నాడో ఈ కలను
ఏ ఉలితో ఈ శిలపై నిలిపాడో ఈ కళను
ఏ వలపుల తలపులతో తెలిపాడో ఈ కథను
ఈ రాళ్ళే జవరాళ్ళై ఇట నాట్యాలాడేను
విశ్లేషణ
లోగిలి = ఇల్లు, house
జవరాలు = పడుచు యువతి, young woman
సంవత్సరం: 1986
రసం: ఆనందం
అక్షరం: ఇ
గుర్తింపు: