ఈ దుర్యోధన దుశ్శాసన (ప్రతిఘటన)

కవనం వేటూరి సుందరరామమూర్తి
చిత్రం: ప్రతిఘటన
గానం: శిష్ట్ల జానకి
సంగీతం: కొమ్మినేని అప్పారావు (చక్రవర్తి)


ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీత లోకంలో
రక్తాశ్రులు చిందిస్తూ రాస్తున్నా శోకంతో
మరో మహాభారతం ఆరవ వేదం
మానభంగపర్వంలో మాతృహృదయ నిర్వేదం

పుడుతూనే పాలకేడ్చి, పుట్టి జంపాలకేడ్చి
పెరిగి పెద్ద కాగానే ముద్దూ మురిపాలకేడ్చి
తనువంతా దోచుకున్న తనయులు మీరు
మగసిరితో బ్రతకలేక కీచకులై, కుటిల కామ నీచకులై
స్త్రీ జాతిని అవమానిస్తే
మీ అమ్మల స్తన్యంతో మీ అక్కల రక్తంతో
రంగరించి రాస్తున్నా ఈనాడే మీకోసం
మరో మహాభారతం ఆరవ వేదం
మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం

కన్న మహాపాపానికి ఆడది తల్లిగా మారి
నీ కండలు పెంచినదీ గుండెలతో కాదా
ఎర్రని తన రక్తాన్నే తెల్లని నెత్తురుజేసి
పెంచుకున్న తల్లీ ఓ ఆడదనే మరిచారా
కనపడలేదా అక్కడ పాపలుగా మీ చరిత్ర
ఏనాడో మీరుంచిన లేత పెదవి ముద్ర
ప్రతి భారతసతి మానం చంద్రమతి మాంగళ్యం

మర్మస్థానం కాదది నీ జన్మస్థానం
మానవతకు మోక్షమిచ్చు పుణ్యక్షేత్రం

శిశువులుగా మీరు పుట్టి పశువులుగా మారితే
మానవరూపంలోనే దానవులై పెరిగితే
సభ్యతకి సంస్కృతికి సమాధులే కడితే
కన్నులుండి చూడలేని ధృతరాష్ట్రుల పాలనలో
భర్తలుండి విధవ ఐన ద్రౌపది ఆక్రందనలో
నవశక్తులు యువశక్తులు నిర్వీర్యం ఔతుంటే
ఏమైపోతుందీ సభ్యసమాజం
ఏమైపోతుందీ మానవధర్మం
ఏమైపోతుందీ ఈ భారతదేశం
మన భారతదేశం


విశ్లేషణ

ప్రతిఘటన = resistance
దుర్వినీత = అవినీతితో కూడిన, corrupted
రక్తాశ్రులు = రక్తపు కన్నీరు, tears of blood
పర్వం = గ్రంధంలో ఒక భాగం, section of an epic book
నిర్వేదం = hopelessness
కుటిల = crooked
రంగరించి = కలగలిపి, blend
మర్మస్థానం = private part


సంవత్సరం: 1985
రసం: రౌద్రం
అక్షరం: ఇ
గుర్తింపు: నంది పురస్కారం

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

%d bloggers like this: