కవనం: వేటూరి సుందరరామమూర్తి
చిత్రం: శంకరాభరణం
గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, వాణీ జయరామ్
సంగీతం: క్రిష్ణన్ కోయిల్ వెంకటాచలం మహదేవన్
దొరకునా ఇటువంటి సేవ
నీ పద రాజీవములచేరు
నిర్వాణ సోపానమధిరోహణము సేయు త్రోవ
రాగాలనంతాలు నీ వేయి రూపాలు
భవరోగ తిమిరాల పోకార్చు దీపాలు
నాదాత్మకుడవై నాలోన చెలగి
నా ప్రాణదీపమై నాలోన వెలిగే
నినుకొల్చు వేళ దేవాదిదేవా
ఉచ్చ్వాస నిశ్వాసములు వాయులీనాలు
స్పందించు నవనాడులే వీణాగానాలు
నడలు ఎదలోని సడులే మృదంగాలు
నాలోని జీవమై నాకున్న దైవమై
వెలుగొందు వేళ మహానుభావా
విశ్లేషణ
రాజీవము = తామర, lotus
నిర్వాణము = ముక్తి, nirvana
సోపానము = మెట్టు, stair
తిమిరము = చీకటి, darkness
పోకార్చు = పోగొట్టు, to remove
చెలగు = ప్రకాశించు, to shine
నడలు = నడకలు
సంవత్సరం: 1979
రసం: భక్తి
అక్షరం: ద
గుర్తింపు: