కవనం: చేంబోలు సీతారామశాస్త్రి
చిత్రం: ప్రేమకథ
గానం: రాజేష్, అనురాధా శ్రీరాం
సంగీతం: సందీప్ చౌతా
దేవుడు కరుణిస్తాడని వరములు కురిపిస్తాడని
నమ్మలేదు నాకు నీ ప్రేమే దొరికే వరకు
స్వర్గం ఒకటుంటుందని అంతా అంటుంటే విని
నమ్మలేదు నేను నీ నీడకు చేరే వరకు
ఒకరికి ఒకరని ముందుగ రాసే ఉన్నదో
మనసున మనసై బంధము వేసే ఉన్నదో
ఏమో ఏమైనా నీతో ఈపైన కడదాక సాగనా
నువ్వు ఉంటేనె ఉంది నా జీవితం, ఈ మాట సత్యం
నువ్వు జంటైతె బ్రతుకులో ప్రతిక్షణం సుఖమేగ నిత్యం
పదే పదే నీ పేరే పెదవి పలవరిస్తోంది
ఇదే మాట గుండెల్లో సదా మోగుతోంది
నేనే నీకోసం నువ్వే నాకోసం ఎవరేమి అనుకున్నా
ప్రేమనే మాటకర్ధమే తెలియదు ఇన్నాళ్ళ వరకు
మనసులో ఉన్న అలజడే తెలియదు నిను చేరె వరకు
ఎటెళ్లేదో జీవితం నువ్వే లేకపోతే
ఎడారిగా మారేదో నువ్వే రాకపోతే
నువ్వూ నీ నవ్వూ నాతో లేకుంటే నేనంటూ ఉంటానా
విశ్లేషణ
పలవరింత = saying silently and continuously
సంవత్సరం: 1999
రసం: ప్రేమ
అక్షరం: ద
గుర్తింపు: నంది పురస్కారం